Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Amit Shah Met Ram Nath Kovind To Discuss One Nation One Election

One Nation-One Election: రామ్ నాథ్ కోవింద్‌తో అమిత్ షా సమావేశం

Published Date :September 6, 2023 , 5:44 pm
By Rajesh Veeramalla
One Nation-One Election: రామ్ నాథ్ కోవింద్‌తో అమిత్ షా సమావేశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ గురించి చర్చించేందుకు హోంమంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. గత శనివారం (సెప్టెంబర్ 2) కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఏ అజెండాతో ముందుకెళ్లాలనే దానిపై న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, శాసన వ్యవహారాల కార్యదర్శి రీటా వశిష్ఠ తదితరులు చర్చించినట్లు సమాచారం.

Read Also: Volvo C40 Recharge: వోల్వో నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఒక్క రీఛార్జ్‌తో 530 కి.మీ

ఈ కమిటీలో హోంమంత్రి అమిత్ షాతో పాటు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, ఎన్‌కే సింగ్, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి, కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ కమిటీలో ఉండేందుకు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి నిరాకరించారు.

Read Also: Rahul Gandhi: ‘ఇండియా’, ‘భారత్‌’ పేరుపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..!

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాజ్యాంగం.. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఏదైనా ఇతర చట్టం నియమాలను పరిశీలిస్తుంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం నిర్దిష్ట సవరణలను కూడా సిఫారసు చేస్తుంది. రాజ్యాంగ సవరణకు రాష్ట్రాల మద్దతు అవసరమా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించి సిఫారసు చేస్తుంది. మరోవైపు వన్ నేషన్- వన్ ఎలక్షన్ ను సమర్ధిస్తూనే.., దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది రాష్ట్రాల సమాఖ్యపై దాడి చేయడమేనని మండిపడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • Delhi
  • One Nation One Election
  • Ram Nath Kovind
  • telugu news

తాజావార్తలు

  • Mamata Banerjee: ఒక్క ఆడదానిపై 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయి.. యోధురాలిగా పోరాడతానన్న మమత

  • Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్

  • IPL 2026: ఐపీఎల్ 2026లో భారీ మార్పు.. మారిన జీటీ, సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్..

  • SRH vs RR: రెండు భారీ మార్పులతో ఇరు జట్లు బరిలోకి.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.?

  • Oppo Pad Mini: ఒప్పో ప్యాడ్ మినీ టాబ్లెట్ ఏప్రిల్ 21న విడుదల.. 8000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions