Amit Shah : సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఈ ఒప్పంద నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా భారత నీటిని వాడుక చేసిందని, ఇకపై ఆ దేశం నీటి కొరతకు ఎదురుకావాల్సిందేనని హెచ్చరించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒప్పందాలను తులతూలకుండా రద్దు చేయలేమని, కానీ సింధూ ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు మాత్రం భారత్‌కు ఉంది. అదే చేశామని అని వివరించారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం శాంతి, పురోగతి లక్ష్యాలతో ఏర్పడిందని, అయితే పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘించిన వేళ భారత నిర్ణయం తగినదేనని పేర్కొన్నారు.
Kubera : ఓటీటీ, శాటిలైట్ పార్ట్‌నర్స్‌ను లాక్ చేసుకున్న ‘కుబేర’..
భారతదేశానికి హక్కుగా లభించిన నీటిని సమర్థంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కెనాల్ నిర్మాణం ద్వారా పాకిస్థాన్‌కు వెళ్లే నీటిని రాజస్థాన్‌కు మళ్లిస్తామని, పాకిస్థాన్ అన్యాయంగా ఉపయోగించుకున్న నీటి ప్రవాహం ఇక ఆ దేశానికి అందదని అని షా చెప్పారు. పాకిస్థాన్ వ్యవసాయం, నీటి వనరులు అత్యధికంగా సింధూ నదులపై ఆధారపడిన నేపథ్యంలో, భారత్ తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. 80 శాతం వ్యవసాయ నీరు ఈ ఒప్పందం ద్వారానే లభించేది. పాక్ జీడీపీలో సింధూ జలాల వాటా 25 శాతమని చూస్తే, భారత్ తాజా విధానం ఆర్ధికంగా ఎంతగానో ప్రభావం చూపనుందని అర్థమవుతుంది.
ఈ సందర్భంగా అమిత్ షా, నియోజకవర్గాల పునర్విభజనపై కూడా మాట్లాడారు. “ఇందుకు ఎవరూ ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. సమతుల్యతతో ప్రక్రియ కొనసాగుతుంది. 2026లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే ఈ అంశాన్ని వ్యతిరేకిస్తోంది,” అని ఆయన విమర్శించారు. అలాగే, మహిళా రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ, “2029లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌తోనే జరగబోతున్నాయి,” అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.
