NTV Telugu Site icon

Amit Shah and Chandrababu Meeting: రాత్రికే ఏపీకి అమిత్‌షా.. చంద్రబాబుతో కీలక భేటీ

Babu

Babu

Amit Shah and Chandrababu Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. కొత్త రికార్డు సృష్టించబోతున్నారు.. మరోవైపు.. జనసేన-బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడంతో.. కేబినెట్‌ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు.. టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా తన కేబినెట్‌లో సముచిత స్థానం కల్పించడంపై దృష్టిసారించారు.. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా.. కేంద్ర మంత్రులు.. ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు.. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకాబోతున్నారు.. రేపటి ప్రమాణ స్వీకారానికి చాలా మంది VVIPలు ఇవాళే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారు.. వారికి ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చే స్తున్నారు..

Read Also: Mohan Bhagwat: నిజమైన ‘‘సేవక్’’ అహంకారిగా ఉండరు.. ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు..

మరోవైపు.. ఈ రోజు రాత్రికే గన్నవరం చేరుకోబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. రాత్రి 10:20 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు.. దాదాపు గంట పాటు చర్చల అనంతరం రాత్రికి 11:20కి నోవోటెల్ కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు అమిత్ షా.. ఇక, రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే, రేపు ప్రమాణస్వీకారం అయితే, ఈ రోజు చంద్రబాబుతో అమిత్‌షా భేటీ ఏంటంటే..? కేబినెట్‌ కూర్పు.. కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా చేరేది ఎవరు? జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి రోల్‌ ఉండనుంది.. బీజేపీ పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.