Site icon NTV Telugu

Amit Shah: నేడు పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా ప్రచారం..

Amith Shah

Amith Shah

Elections 2024: నాలుగో విడత ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (శుక్రవారం) మరోసారి పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ రోజున అసన్‌సోల్, రాంపూర్‌హాట్, రానాఘాట్‌లలో మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా కూడా బెంగాల్‌లో పర్యటించి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

Read Also: Prathinidhi 2 : రిలీజ్ కు ముందు ప్రతినిధి 2 కి షాక్..

కాగా, బెంగాల్ రాష్ట్రంలోని బరాక్‌పూర్, హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలతో పాటు నాడియా జిల్లాలోని కృష్ణానగర్‌లో నిర్వహించే రోడ్ షోలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొననున్నారు. అయితే, కృష్ణానగర్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మోయిత్రాపై బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజమాతా అమృతా రాయ్ కోసం ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.

Read Also: TFDA: డైరెక్టర్ల కోసం ఎవరూ ఊహించని సాయం చేయడానికి రెడీ అయిన బన్నీ..

అలాగే, అదే సమయంలో కోల్‌కతాలోని జాదవ్‌పూర్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీకి రైల్వే మంత్రి వైష్ణవ్ నేటి ఉదయం 11 గంటలకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రైల్వే సిటీ ఖరగ్‌పూర్ నగరంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం బరాసత్‌లోని వెస్టిన్‌ హోటల్‌లో రాత్రి 8 గంటలకు బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు.

Exit mobile version