NTV Telugu Site icon

Amit Shah: ఎంఎస్‌పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు

Amit Shah

Amit Shah

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంఎస్‌పి యొక్క పూర్తి అర్థం ఏంటో తెలుసా..? అని ప్రశ్నించారు. హర్యానాలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం 24 పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి కొనుగోలు చేస్తోందని అమిత్ షా తెలిపారు. హర్యానాలోని రేవారిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా అవినీతి, రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. రైతుల సమస్యపై కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఎంఎస్‌పి (కనీస మద్దతు ధర) పేరుతో ఓట్లు వేస్తారని రాహుల్‌కు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ‘బాబా’ చెప్పాయని అన్నారు. “రాహుల్ బాబా, మీకు MSP పూర్తి పేరు తెలుసా?” ఏది రబీ పంట.. ఏది ఖరీఫ్ పంట అని మీకు తెలుసా..? అంటూ కామెంట్స్ చేశారు.

Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

హర్యానాలోని బిజెపి ప్రభుత్వం 24 పంటలను ఎంఎస్‌పిపై కొనుగోలు చేస్తోందని షా అన్నారు. ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఇన్ని పంటలు కొనుగోలు చేస్తున్నారో.. హర్యానా కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో క్వింటాల్‌కు 1300 రూపాయలకే వరి కొనుగోలు చేశారని.. అయితే ఇప్పుడు 2300 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామన్నారు. కర్ణాటక, తెలంగాణలో ఎన్ని పంటలు ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తున్నారని షా ప్రశ్నించారు. హర్యానాలో బిజెపి ప్రభుత్వం అధికారంలో వస్తే.. తాము వరిని రూ. 3,100 (క్వింటాల్‌కు) కొనుగోలు చేస్తామని తెలిపారు.

CM Siddharamiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు..

కాంగ్రెస్‌ను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ అనే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని అన్నారు. హర్యానాలో బీజేపీ ఏకరీతి అభివృద్ధిని తీసుకొచ్చిందని.. గత 10 ఏళ్లలో అవినీతి అంతమైందని షా తెలిపారు. హర్యానాలో సెప్టెంబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Show comments