NTV Telugu Site icon

Iran Israel tensions: ఎయిరిండియా కీలక ప్రకటన.. సర్వీస్‌లు నిలిపివేత

Air

Air

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు టెల్ అవీవ్‌కు వెళ్లే అన్ని విమాన సర్వీస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎక్స్ ట్విట్టర్ ద్వారా ఎయిరిండియా తెలిపింది.

ఇది కూడా చదవండి: Yarlagadda VenkatRao: గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు విస్తృత పర్యటన..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాలను ఏప్రిల్ 30, 2024 వరకు నిలిపివేసినట్లు ఎయిరిండియా పేర్కొంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు రీషెడ్యూల్ చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో ఎయిరిండియా పేర్కొంది. మరింత సమాచారం కోసం 011-69329333 / 011-69329999 నెంబర్లకు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని.. లేదా వెబ్‌సైట్ http://airindia.comని సందర్శించొచ్చని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Kejriwal: ఇన్సులిన్ పిటిషన్‌పై విచారణ.. కోర్టు ఏం తేల్చిందంటే..!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇరాన్.. ఇజ్రాయెల్‌పై డ్రోన్, క్షిపణి దాడులకు తెగబడింది. దీన్ని ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంది. ఎలాంటి నష్టం జరగలేదు. దీనికి ప్రతీకారంగా శుక్రవారం ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై క్షిపణి దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. వాటిని పేల్చేశామని ఇరాన్ తెలిపింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు. ఇదిలా ఉంటే మరోసారి ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే ఆయా దేశాలు.. తమ పౌరులు పశ్చిమాసియాలో పర్యటించొద్దని కోరింది. అలాగే భారతీయులు కూడా భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Namburu Sankara Rao: ప్రచారంలో జోరు పెంచిన నంబూరు శంకరరావు..