NTV Telugu Site icon

Joe Biden: వయనాడ్ ఘటనపై అమెరికా ప్రథమ మహిళ జిల్, అధ్యక్షుడు బైడెన్ సంతాపం..

Untitled Design

Untitled Design

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంప్లెక్స్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో మొదటిగా నిలిచిన సేవా సభ్యులు, సిబ్బంది ధైర్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో అయిదు రోజుల కిందట కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. శిథిలాల తొలగింపు తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై తాజాగా జిల్ (అమెరికా ప్రథమ మహిళ), అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

READ MORE: Moon Drifting Away: భూమికి దూరంగా వెళ్తున్న చంద్రుడు.. రోజుకు 25 గంటలే..!

“ఈ విషాద సంఘటనలో బాధితుల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. కుటుంబీకులను కోల్పోయిన వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. సంక్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌లో సహకరించిన భారతీయ సేవా సభ్యుల ధైర్యాన్ని, ప్రథమ స్పందనదారులను మేము అభినందిస్తున్నాం. మీ కృషి ఎనలేనిది.. ఈ క్లిష్ట సమయంలో అమెరికా భారతదేశ ప్రజలతో ఉంది.” అని జో బైడెన్ పేర్కొన్నారు.

READ MORE: AP Capital: రాజధాని ప్రాంతంలో నిపుణుల బృందం పర్యటన..

కాగా.. ప్రకృతి అందాలకు నెలవైన కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ప్రస్తుతం ఎటు చూసినా కూడా విషాద వాతావరణం నెలకొని ఉంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మరణించిన వారి సంఖ్య 344కి చేరింది. ఇంకా 200 మందికి పైగా తప్పిపోయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాలంలో పోటీ పడుతున్నారు. బురదలో కూరుకుపోయిన ఇళ్లలో ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా..? అని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డీప్ సెర్చ్ రాడార్ ఉపయోగించి చిక్కుకుపోయిన వారిని కనుగొనే ప్రయత్నం జరుగుతోంది.

Show comments