Plane Crash : అమెరికాకు చెందిన ఓ ఫైటర్ జెట్ కుప్పకూలింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ విమానం జపాన్ తీరానికి సమీపంలో కూలిపోయింది. ఎనిమిది మంది వ్యక్తులతో వెళ్తున్న US Osprey అనే సైనిక విమానం బుధవారం (నవంబర్ 29) కుప్పకూలినట్లు కోస్ట్ గార్డ్ తెలిపింది. యకుషిమా ద్వీపంలో యుఎస్ మిలిటరీ ఓస్ప్రే కూలిపోయిందని ఈ రోజు మధ్యాహ్నం 2:47 గంటలకు మాకు సమాచారం అందినట్లు సైనిక ప్రతినిధి చెప్పారు.
Read Also:India China News: హర్యానా నుండి తమిళనాడు వరకు కరోనా నియమాలను పాటించాలంటున్న ప్రభుత్వం
బోర్డులో ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని కూడా తమకు సమాచారం అందిందన్నారు. ప్రస్తుతానికి వారి ఆచూకీపై తదుపరి సమాచారం లేదని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో కాలిఫోర్నియాలోని సైనిక స్థావరం సమీపంలో అమెరికాకు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ చనిపోయాడు. ఈ విషయాన్ని US మెరైన్ కార్ప్స్ ధృవీకరించింది. శాన్ డియాగో కేంద్రానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ మిరామార్ సమీపంలో అర్ధరాత్రి ముందు F/A-18 హార్నెట్ జెట్ కూలిపోయిందని పేర్కొంది. సెర్చ్ సిబ్బంది పైలట్ మృతదేహాన్ని కనుగొన్నారు.
Read Also:Revanth Reddy: బిర్లా టెంపుల్‌లో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి.. రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు!