NTV Telugu Site icon

Soap Bank: 90 లక్షల సబ్బులను సేకరించిన యువకుడు.. వాటిని ఏం చేశాడంటే..?

Eco Soap Bank

Eco Soap Bank

Soap Bank: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన సమీర్‌ లఖానీ అనే యువకుడు 8 ఏళ్ల కిందట కాంబోడియా పర్యటనకు వెళ్లాడు. అక్కడి పురాతన కట్టడాలు చూసి ఎంతగానో ఆనందించాడు. అయితే అదే సమయంలో ఆ నిర్మాణాల చెంత నిరుపేదలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయాడు. ఓ తల్లి నెలల పసికందుకు దుస్తులు ఉతికే సబ్బుతో స్నానం చేయిస్తుండటం చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. అటు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిలో కేవలం ఒక్కశాతం మాత్రమే వంటి సబ్బుతో స్నానం చేస్తున్నట్టు తెలుసుకుని నిరుపేదలకు ఏదో ఒకటి చేయాలని తపించాడు. దీంతో ఏకో సోప్ బ్యాంక్ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈ సంస్థ ద్వారా వాడిన సబ్బులు, అరిగిపోయిన సబ్బులను సేకరించడం పనిగా పెట్టుకున్నాడు.

Read Also: Mumbai Metro: వైరల్ వీడియో.. యువతిని ఈడ్చుకెళ్లిన మెట్రోరైలు

తాను సేకరించిన సబ్బులను రీసైకిల్ చేసిన మన్నికగా తీర్చిదిద్దేవాడు. ఇలా ఏకో సోప్ బ్యాంక్ స్వచ్ఛంద సంస్ధ త్వారా సమీర్ లఖానీ ఏకంగా 90 లక్షల సబ్బులను సేకరించాడు. పది దేశాల్లో 16 రీసైకిల్‌ యూనిట్ల ద్వారా వాటిని తాజా సబ్బులుగా తీర్చిదిద్దాడు. వీటిని కాంబోడియాతోపాటు మరెన్నో దేశాల్లోని నిరుపేదలకు అందించాడు. ఇలా 2014 నుంచి సేవాపథంలోనే కొనసాగుతూ సమీర్ లఖానీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2017లో సీఎన్‌ఎన్‌ టాప్‌ టెన్‌ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. 2020 ఫోర్బ్స్‌ టాప్‌ థర్టీ అండర్‌ థర్టీ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. కాగా సమీర్‌ భారత మూలాలున్న అమెరికన్‌ కావడం విశేషం.