IND vs USA: స్వల్ప స్కోరు చేసిన అమెరికా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
- 110 పరుగులు చేసిన అమెరికా
- భారత్ టార్గెట్ 111 పరుగులు
- 4 వికెట్లతో చెలరేగిన అర్ష్‌దీప్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు భారత్-అమెరికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. న్యూయార్క్‌లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అమెరికా తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు పరుగులు చేయనీయకుండా కట్టడి చేశారు. భారత్ ముందు 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది అమెరికా. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. సూపర్-8లోకి ఎంట్రీ ఇస్తుంది.
Read Also: Pope francis: జీ 7 నాయకుల్ని ఉద్దేశించి ప్రసంగించనున్న పోప్ ఫ్రాన్సిస్
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో అమెరికా బౌలర్లు చేతులెత్తేశారు. అమెరికా బ్యాటింగ్‌లో షాయన్ జహంగీర్ డకౌట్‌తో మొదట్లోనే పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత.. స్టీవెన్ టేలర్ (24) నితీశ్ కుమార్ (27) పరుగులతో రాణించారు. మిగత బ్యాటర్లంతా పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. ఆండ్రీస్ గౌస్ (2), ఆరోన్ జోన్స్ (11), కోరీ అండర్సన్ (15), హర్మీత్ సింగ్ (10), షాడ్లీ వాన్ షాల్క్విక్ (11), జస్దీప్ సింగ్ (2) పరుగులు చేశారు. దీంతో అమెరికా తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగింది.
Read Also: Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..
టీమిండియా బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్‌లో ఒక ఓవర్ మెడిన్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి టీమిండియా సూపర్-8లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!