NTV Telugu Site icon

IND vs USA: స్వల్ప స్కోరు చేసిన అమెరికా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

Ind

Ind

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు భారత్-అమెరికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. న్యూయార్క్లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో అమెరికా తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు పరుగులు చేయనీయకుండా కట్టడి చేశారు. భారత్ ముందు 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది అమెరికా. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే.. సూపర్-8లోకి ఎంట్రీ ఇస్తుంది.

Read Also: Pope francis: జీ 7 నాయకుల్ని ఉద్దేశించి ప్రసంగించనున్న పోప్ ఫ్రాన్సిస్

మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో అమెరికా బౌలర్లు చేతులెత్తేశారు. అమెరికా బ్యాటింగ్లో షాయన్ జహంగీర్ డకౌట్తో మొదట్లోనే పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత.. స్టీవెన్ టేలర్ (24) నితీశ్ కుమార్ (27) పరుగులతో రాణించారు. మిగత బ్యాటర్లంతా పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. ఆండ్రీస్ గౌస్ (2), ఆరోన్ జోన్స్ (11), కోరీ అండర్సన్ (15), హర్మీత్ సింగ్ (10), షాడ్లీ వాన్ షాల్క్‌విక్ (11), జస్దీప్ సింగ్ (2) పరుగులు చేశారు. దీంతో అమెరికా తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగింది.

Read Also: Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..

టీమిండియా బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. అర్ష్దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్లో ఒక ఓవర్ మెడిన్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది. కాగా.. ఈ మ్యాచ్లో గెలిచి టీమిండియా సూపర్-8లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

Show comments