Ambulance Misuse : మిర్చి బజ్జీల కోసం సైరన్‌తో అంబులెన్సు వేసుకెళ్లిన డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగు ప్యాకెట్ కోసం ఓ లోకోపైలెట్ ఏకంగా రైలును మధ్యలో ఆపేసిన ఘటన గురించి విన్నాం. కచోరీ తినాలనిపించి రైలు ఆపేసిన లోకో పైలెట్ గురించి విన్నాం. కానీ హైదరాబాద్‌లో ఓ అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం అందరికి కోపం తెప్పించే విధంగా ఉంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ సైరన్ వేసుకొని ట్రాఫిక్‌లో యమస్పీడ్‌తో వెళ్తున్నాడు. ఇది చూసిన ట్రాఫిక్ పోలీసులు సైతం ఎంత ఎమర్జెన్సీ ఉందోనని ట్రాఫిక్ పోలీస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి మరీ.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారిచ్చారు. అయితే.. ఇంత కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేసిన ట్రాఫిక్ పోలీసులకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చాడు ఆ అంబులెన్స్ డ్రైవర్.
Also Read : Baby: సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది- వైష్ణవీ చైతన్య
Also Read
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రాఫిక్ నుంచి బయటకు రాగానే.. దగ్గర్లో ఉన్న మిర్చి బండి వద్ద అంబులెన్స్‌ను ఆపి తీరిగ్గా.. మిర్చి బజ్జీలు, కూల్‌డ్రింక్స్ ఆరగించాడు. ఇదేంటి.. ఎంతో ఎమర్జెన్సీతో వచ్చిన అంబులెన్స్ ఇలా మిర్చి బజ్జీల బండి దగ్గర ఆగిందని అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు తీరా అక్కడికి వెళ్లి చూడగా.. ఎంచక్కా అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు అంబులెన్స్ సిబ్బంది మిర్జీబజ్జీలు తింటున్నారు. దీంతో చిరెత్తుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రశ్నించగా.. కుంటిసాకు చెప్పడంతో.. దీనికి సంబంధించిన మొత్తం తతంగాన్ని వీడియో తీసి పై అధికారులకు పంపించారు. దీనిపై స్పందించిన డీజీపీ అంజనీ కుమార్.. ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటేనే సైరన్ వినియోగించాలని, అంబులెన్స్ సైరన్ ఇష్టం వచ్చినట్లు వాడితే కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read : Madras High Court: రక్తనమూనాలతో లైంగిక పటుత్వ పరీక్ష.. టూ ఫింగర్ టెస్టును తొలగించండి..
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!