NTV Telugu Site icon

Ambulance Misuse : మిర్చి బజ్జీల కోసం సైరన్‌తో అంబులెన్సు వేసుకెళ్లిన డ్రైవర్

Amubalance

Amubalance

పెరుగు ప్యాకెట్ కోసం ఓ లోకోపైలెట్ ఏకంగా రైలును మధ్యలో ఆపేసిన ఘటన గురించి విన్నాం. కచోరీ తినాలనిపించి రైలు ఆపేసిన లోకో పైలెట్ గురించి విన్నాం. కానీ హైదరాబాద్‌లో ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్వాకం అందరికి కోపం తెప్పించే విధంగా ఉంది. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ సైరన్ వేసుకొని ట్రాఫిక్‌లో యమస్పీడ్‌తో వెళ్తున్నాడు. ఇది చూసిన ట్రాఫిక్‌ పోలీసులు సైతం ఎంత ఎమర్జెన్సీ ఉందోనని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టాండ్‌ నుంచి బయటకు వచ్చి మరీ.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారిచ్చారు. అయితే.. ఇంత కష్టపడి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులకు దిమ్మతిరిగేలా షాక్‌ ఇచ్చాడు ఆ అంబులెన్స్‌ డ్రైవర్‌.

Also Read : Baby: సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది- వైష్ణవీ చైతన్య

ట్రాఫిక్‌ నుంచి బయటకు రాగానే.. దగ్గర్లో ఉన్న మిర్చి బండి వద్ద అంబులెన్స్‌ను ఆపి తీరిగ్గా.. మిర్చి బజ్జీలు, కూల్‌డ్రింక్స్‌ ఆరగించాడు. ఇదేంటి.. ఎంతో ఎమర్జెన్సీతో వచ్చిన అంబులెన్స్‌ ఇలా మిర్చి బజ్జీల బండి దగ్గర ఆగిందని అనుమానం వచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు తీరా అక్కడికి వెళ్లి చూడగా.. ఎంచక్కా అంబులెన్స్‌ డ్రైవర్‌తో పాటు అంబులెన్స్‌ సిబ్బంది మిర్జీబజ్జీలు తింటున్నారు. దీంతో చిరెత్తుకు వచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు అంబులెన్స్‌ డ్రైవర్‌ను ప్రశ్నించగా.. కుంటిసాకు చెప్పడంతో.. దీనికి సంబంధించిన మొత్తం తతంగాన్ని వీడియో తీసి పై అధికారులకు పంపించారు. దీనిపై స్పందించిన డీజీపీ అంజనీ కుమార్‌.. ఎమర్జెన్సీ పేషెంట్స్‌ ఉంటేనే సైరన్‌ వినియోగించాలని, అంబులెన్స్‌ సైరన్‌ ఇష్టం వచ్చినట్లు వాడితే కఠిన చర్యలు తప్పవని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాకుండా.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read : Madras High Court: రక్తనమూనాలతో లైంగిక పటుత్వ పరీక్ష.. టూ ఫింగర్ టెస్టును తొలగించండి..