Crime News: అంబర్ పేట్లో దారుణం.. భార్యపై కన్నేశాడని స్నేహితుడిని..!
- అంబర్ పేట్లో దారుణం
- భార్యపై కన్నేశాడని స్నేహితుడి హత్య
- హత్య వివరాలను వెల్లడించిన డీసీపీ బాలస్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబర్ పేట్లో మూసీ కాలువలో కొట్టుకొచ్చిన అనుమానస్పద మృతదేహంపై మిస్టరీ వీడింది. యువకుడిని (షోరబ్) హత్య చేసి మూసీ కాలువలో పడేశారని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు (మహమ్మద్ జావిద్, మహమ్మద్ అమీరుల్ హాక్) యువకుడి మెడకి వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా గుర్తించారు. అంబర్ పేట పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డీసీపీ బాలస్వామి యువకుడి హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు.
మహమ్మద్ జావేద్ (27), మహమ్మద్ అమీరుల్ హాక్, షోరబ్ (30) ముగ్గురు స్నేహితులు. ముగ్గురు ఫాల్ సీలింగ్ వర్కర్లుగా పనిచేస్తూ బోడుప్పల్ ద్వారకా నగర్లో నివాసం ఉంటున్నారు. వీరు బీహార్‌కు చెందిన వ్యక్తులు. తన భార్యపై షోరబ్ కన్నేశాడని జావేద్ అనుమానించాడు. ఈ విషయంపై పలుమార్లు షోరబ్‌ను జావేద్ మందలించాడు. అయినా కూడా షోరబ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. విసుగు చెందిన జావేద్ హత్యకు ప్లాన్ చేశాడు.
Also Read
Also Read: Hardik Pandya: హార్దిక్ వాచ్ ధర అన్ని కోట్లా.. ఆసియా కప్ ప్రైజ్ మనీకి 10 రెట్లు!
అమీర్ హుల్ హక్ సహాయంతో అంబర్ పేట్‌లోని మూసీ ప్రాంతంలో మహమ్మద్ జావేద్ హత్యకు ప్లాన్ వేశాడు. ఇద్దరు కలిసి షోరబ్‌కు పూటుగా మద్యం తాగించారు. మద్యం మత్తులోకి వెళ్లాక మెడకు వైర్లు చుట్టి హత్య చేశారు. జావేద్, అమీర్ కలిసి షోరబ్ మృతదేహాన్ని మూసీలో పడేశారు. షోరబ్ స్నేహితుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!