NTV Telugu Site icon

Amabati Rayudu : ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉంది.. అది ఏ ఫ్లాట్ ఫామ్ పై అనేది త్వరలో చెప్తా

Ambati Rayudu

Ambati Rayudu

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ అరంగ్రేటం ఖయమైనట్లు తెలుస్తుంది…. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలో అంబటి రాయుడు సందడి చేస్తున్నారు… గుంటూరు జిల్లా లో గ్రామాల్లో పర్యటిస్తున్న అంబటి రాయుడు యువత తో సెల్ఫీలు, పెద్దలలో ఫోటో లు దిగితు హల్చల్ చేస్తున్నారు… తనకు మాత్రం ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉందనీ అది ఏ ఫ్లాట్ ఫామ్ పై అనేది త్వరలో చెప్తానని అంటున్నారు అంబటి రాయుడు.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుంటున్నానీ త్వరలో అన్ని విషయాలు చెప్తానని అంటున్నారు అంబటి రాయుడు.

Also Read : Kottu Satyanarayana: వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్.. పవన్ ప్రసంగాలు ఉన్మాదికి ఎక్కువ, పిచ్చికి తక్కువ

కాగా.. అంబటి రాయుడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. త్వరలోనే అతడు అమెరికా వేదికగా జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) లో పాల్గొననున్నాడు. ఇది ముగిసిన తర్వాత రాయుడు తన లైఫ్ లో మరో ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. వైఎస్సార్‌సీపీలో ఆయన చేరనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రాయుడు ఇప్పటికే పలుమార్లు ఆంధ్రా సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలవడం.. ట్విటర్ లో జగన్ పై ప్రశంసలు కురిపించే పనిపెట్టుకోవడం కూడా అంబటి రాయుడు రాజకీయ ప్రవేశానికి సూచికలుగా కనిపిస్తున్నాయి.

Also Read : Pakistan-China: చైనాకు గాడిదలను విక్రయించేందుకు పాక్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Show comments