Site icon NTV Telugu

Ambati-Pemmasani: పెమ్మసాని 18 రోజులు సినిమా చుపించావ్.. తప్పక మూల్యం చెల్లించాల్సిందే!

Ambati Pemmasani

Ambati Pemmasani

Ambati Rambabu Warns Pemmasani Chandrasekhar over Arrest Controversy: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పెమ్మసాని 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పి.. పెద్ద సినిమా చూపించారన్నారు. ఎలాగా 18 రోజులు సినిమా చుపించావ్ అని ఎద్దేవా చేశారు. ఇల్లు పగలగొట్టడంలో, కార్లు ధ్వంసం చేయడంలో, ఆఫీస్ ధ్వంసం చేయడంలో, భార్యా బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమికొట్టడంలో, లాకప్లో పడేసేలా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావ్ అని అంబటి మండిపడ్డారు. పెమ్మసాని.. ఇంత పెద్ద సినిమా చూపించావే, ఇందులో ఎవరు హీరో నేనే? అని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్స్ అయ్యారు అని పేర్కొన్నారు. పెమ్మసాని.. తప్పక మూల్యం చెల్లించాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు.

శుక్రవారం ఉదయం అంబటి మీడియాతో మాట్లాడుతూ…’ఇరవై రోజుల నుంచి ఎన్నో జరుగుతున్నాయి. ప్రజలు వాస్తవాలు అర్దం చేసుకున్నారు. జనవరి 31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు తీర్పుతో మొన్న విడుదల అయ్యాను. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు. నా కుటుంబం, నా కూతురు అన్నీ అర్దమయ్యేవిధంగా చెప్పారు. ఇక్కడే అన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. టీడీపీ కట్టిన ఫ్లెక్సీ వద్దకు వెళ్ళి ఇది మంచి పద్దతి కాదని చెప్పాను. ఇది మంచి పద్దతి కాదని చెప్పాను.. కానీ చించివెయ్యలేదు. మరుసటి రోజు గుళ్లలో పూజలు చెయ్యమని పార్టీ పిలుపు ఇచ్చింది, పర్మిషన్ తీసుకుని వెళ్లాను. నల్లపాడు సీఐ అడిగితే ఫ్లెక్సీ వద్దకు వెళ్లనని చెప్పాను. తిరిగి వస్తుంటే కారు అడ్డుకుని అమ్మ, అక్క అంటూ తిట్టారు. అప్పుడు నేను తిట్టాను. అది ఆ సమయంలో జరిగింది. తర్వాత ఇంటికొచ్చి ఆలోచిస్తే నా అంతరాత్మ ఒప్పుకోలేదు. నేను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదు. నేను ఈ వయసులొ తిట్టి ఉండాల్సింది కాదనుకున్నాను. పశ్చాతాఫాన్ని మించింది ఏదీ లేదు’ అని చెప్పారు.

‘ఐదు గంటలకు నా ఇంటివద్దకు అనేక నియోజకవర్గాల నుంచి జనం వచ్చారు. నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, మనవళ్లు ఉన్నారు. ఏడు గంటలపాటు కరాళనృత్యం చేశారు. పోలీసుల అండతో రెచ్చిపోయారు. ఎక్కడైనా పోలీసులు, గూండాలు ఒక్కటవుతారా?. ఇది ధర్మమేనా?. వైసీపీ వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు పారిపోవాలని నాతో చెప్పారు. పారిపోవడం కన్నా చచ్చిపోవడం మేలని ఆయనకు చెప్పాను. ఇంత దారుణం, అన్యాయం జరిగితే స్పందించరా?. పోలీసులు తీసుకెళ్లి లాకప్లో పెట్టారు. రాత్రి 2 గంటలకు స్టేషన్ పైకి తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఎందుకో కొట్టలేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తా. నల్లపాడు సీఐ వంశీ రిమాండ్ రిపోర్ట్లో కమ్మ నా కొడకల్లారా అని తిట్టానని పేర్కొన్నారు. నా ఇద్దరు అల్లుళ్లు కమ్మవారే. కులాల పేరుతో రెచ్చగొడుతుంది మీరే’ అని ఫైర్ అయ్యారు.

Also Read: Ambati Rambabu: ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటూ వేదికపైనే.. పవన్ అసహ్యంగా మాట్లాడలేదా?

‘చంద్రబాబును కూడా తిట్టానంట. జిల్లాలో ఉన్న కమ్మ నేతలందరినీ రెచ్చగొట్టారు. నా ఇంటిపైకి వచ్చిన వారందరూ కమ్మవారే. గల్లా రామచంద్రరావు, అబ్బూరు మల్లి, కనపర్తి శ్రీనివాసరావు కమ్మవారే. నేను ఎప్పుడూ కులం పేరుతో మాట్లాడను. పెమ్మసాని 24 గంటల్లో సినిమా చూపిస్తామన్నారు. 18 రోజులు సినిమా చూపించావు. ఇంత పెద్ద సినిమా చూపించావే ఇందులో ఎవరు హీరో, విలన్లు ఎవరు. అనని మాటలు అన్నట్లు రాసినవారు విలనా?. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్స్ అయ్యారు. అన్నింటికీ మూల్యం చెల్లించే రోజు ఒకటి వస్తుంది. పెమ్మసాని తప్పక మూల్యం చెల్లించాల్సిందే’ అని వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version