Ambati Rambabu: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో, పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌లను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. డీజీపీ రాజకీయ నేత లాగా వ్యవహరించకూడదని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారని అన్నారు. మాజీ మంత్రి విడదల రజినీ మీద సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సెటైరికల్ కామెంట్లు పెడితే తప్పులేదు, అసభ్యకరంగా కామెంట్లు పెట్టవద్దన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడుల వ్యవహారంలో కక్షగట్టి మా కార్యకర్తలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొత్త కొత్త సెక్షన్‌లు పెడుతున్నారన్నారు. మారిపోతున్న కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. డీజీపీకి మా బాధ చెప్పుకుందామంటే, వైసీపీ నాయకుల ఫోన్లను ఆన్సర్ చేయడం లేదన్నారు.
Read Also: Pawan Kalyan: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ