NTV Telugu Site icon

Ambati Rambabu: పవన్ ఎంటర్ టైనర్ మాత్రమే.. జగన్ జనం మనసు గెలిచిన ధీరుడు

Ambatri1

Ambatri1

Ambati Rambabu Strong Comments on Pawan Kalyan :ఏపీలో రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. పల్నాడులో మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ పిరికివాడు…చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ మీద పోరాటానికి వస్తారంట అని ఎద్దేవా చేశారు. ఇద్దరు కలసి వచ్చినా జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోవాల్సిందే అన్నారు. మోసం చేసే చంద్రబాబుకి చంద్ర బాబు మోచేతి నీళ్లు తాగి బ్రతికే పవన్ కు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరు…16 నెలలు జైల్లో పెట్టినా జగన్ భయపడలేదన్నారు మంత్రి అంబటి రాంబాబు.

ఎవ్వరి అండ లేకుండా సింగిల్ గా ప్రజల మనస్సు గెలిచిన ధీరుడు జగన్ ..పవిత్రమైన వారాహి దేవత పేరు పెట్టుకుని చిందులు వేస్తే ,పిచ్చి మాటలు మాట్లాడితే ఆ దేవత కాళ్ళ క్రింద పడి నలిగి పోవడం ఖాయం అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎవరు ముఖ్యమంత్రి కావాలని లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడో అతనికే తెలియదు…పవన్ ఎంటర్ టైనర్ మాత్రమే,…ఎడ్యుకేటర్ కాదన్నారు అంబటి. ఏపీ మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల సందర్భంగా బంజారా మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంబటి ఆధ్వర్యంలో భోగి వేడుకలు జరిగాయి.

Read Also:Keerthy Suresh: మహానటి పెళ్లి.. సోషల్ మీడియాను షేక్ చేస్తుందే..?

స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా అంబటి సరదాగా గడిపారు. తాను డ్యాన్స్ చేసిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. సంక్రాంతి సందర్భంగా అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ పై జనసేన నేత, పవన్ సోదరుడు నాగబాబు తీవ్రమయిన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ‘సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేశారు. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి ఉంటే ఇంకా మహత్తరంగా ఉండేది’ అని నాగబాబు ఎద్దేవా చేశారు. నాగబాబు సెటైర్ పట్ల అంబటి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. ‘నువ్వు, నీ తమ్ముడు అన్నట్టు నేను సంబరాల రాంబాబునే. కానీ ముఖానికి రంగు వేయను. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కొండగట్టులో వారాహి వాహనానికి పవన్ ప్రత్యేక పూజలు చేశారు.

Read Also: Pune Crime News: దారుణం.. ఏడుగురిని బలి తీసుకున్న ‘ప్రతీకారం’

Show comments