NTV Telugu Site icon

Ambati Rambabu: మావారిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద చేస్తున్న పోస్టులను డీజీపీకి ఇచ్చామని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోరామని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారని.. సుధారాణి అనే యువతిపై చిలకలూరిపేట సీఐ తీవ్రంగా దాడి చేసి కొట్టారని ఆయన పేర్కొన్నారు. దీనిపై కూడా డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. జగన్, భారతి, విజయమ్మ, అవినాష్‌రెడ్డి ఇతరులపై తప్పుడు కేసులు పెట్టారని.. ఆ వివరాలు కూడా డీజీపీకి ఇచ్చామన్నారు. మావారిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తామన్నారు. ఆడబిడ్డపై దాడులు జరిగితే సహించననే చంద్రబాబు.. సుధారాణి విషయంలో ఎలా స్పందిస్తారో వేచిచూస్తామన్నారు. మా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రెండు రోజులు చూస్తామని.. ఆ తర్వాత కోర్టును ఆశ్రయిస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

 

Show comments