Site icon NTV Telugu

Ambati Rambabu: చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్..

Ambati

Ambati

చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తనను ఆంబోతు రాంబాబు అంటున్నాడు.. అధికారికంలోకి వస్తే తనకు ముక్కుతాడు వేస్తాడట.. అధికారికంలో వచ్చేది లేదు, చచ్చేది లేదుని దుయ్యబట్టారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేతి పై పచ్చబొట్టు వేయిస్తానని అన్నారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే రాజకీయ నాయకుడు అని వేయిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నన్ను గిల్లితే నేను గిల్లనా..? నన్ను ఆంబోతు రాంబాబు అంటే ఊరుకోవాలా..? పచ్చబొట్టు వేయిస్తాం అనటం కూడా తప్పు అవుతుందా? అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Maldives: మోడీకి క్షమాపణ చెప్పండి.. మాల్దీవుల అధ్యక్షుడికి సూచించిన..!

అసాధ్యమైనవి అన్నీ ఇస్తానని చంద్రబాబు ప్రజలను మభ్య పెడతారని మంత్రి అంబటి ఆరోపించారు. గెలిచిన తరువాత మ్యానిఫెస్టో కనిపించకుండా మాయం చేయటం చంద్రబాబు విజన్ అని దుయ్యబట్టారు. చంద్రబాబు శరీరంలోని ప్రతి అణువు విషమేనని అన్నారు. నల్ల విషపాము చంద్రబాబు చూసినా అది చచ్చిపోతుందని విమర్శించారు. చంద్రబాబు నిలువెల్లా విషమే అని దుయ్యబట్టారు. సీఎం జగన్ సిద్ధం అనగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తాము సిద్ధం అంటున్నారు.. ఎన్నికలు తర్వాత తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ వెళ్ళటానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ మేమూ సిద్ధం అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు.. చంద్రబాబు, లోకేష్ ను భుజాన ఎత్తుకోవడానికా..? ప్యాకేజీ ఇస్తే పట్టుకుని పోవటానికి సిద్ధమా..? అని దుయ్యబట్టారు.

Read Also: Bapatla: మార్టురులో గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్ దాడులు.. అడ్డుకున్న ఎమ్మెల్యే

Exit mobile version