Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరులో మెగా డీఎస్సీ నియామకాలపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ గుంటూరు జాయింట్ కలెక్టర్‌కు వైసీపీ నేతలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కుట్రపూరిత ప్రణాళికతో వ్యవహరించిందని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘మెగా డీఎస్సీలో మొత్తం 441 పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలోని కొన్ని పోస్టులను అక్రమంగా కేటాయించారు. మరికొన్ని పోస్టులు డబ్బులు తీసుకుని అమ్ముకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అనుకూలంగా ఉండే అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకే స్పోర్ట్స్ కోటా నిబంధనలను మార్చారు. పరీక్ష నిర్వహణకు ముందు అమల్లో ఉన్న జీవోను రద్దు చేసి.. కొత్త జీవో తీసుకొచ్చారు. నియామకాలు పూర్తైన తర్వాత మళ్లీ పాత జీవోను పునరుద్ధరించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Also Read
- Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో 'పే లేటర్' సదుపాయం!
- The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
- Rega Kantha Rao: "కేసు కొట్టేయండి".. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
- ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
‘స్పోర్ట్స్ కోటా విషయంలో సాధారణంగా 2 శాతం రిజర్వేషన్ ఉండాల్సి ఉండగా.. దానిని 3 శాతానికి పెంచారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని జీవోలో మార్పులు చేశారు. ఈ మార్పుల వల్ల కొందరికి అన్యాయం జరిగింది. నవీన్ అనే అభ్యర్థికి ఉద్యోగం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. చర్చల పేరుతో అసలు సమస్యను ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. పరీక్షకు ముందు, తర్వాత జీవోలను మార్చడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలి’ అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
అలాగే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేసిన అంబటి రాంబాబు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నిరుద్యోగులకు తగిన ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి కూడా అమలు చేయలేదని విమర్శిస్తూ.. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని అన్నారు. మెగా డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నిజాలు వెలుగులోకి తీసుకురావాలని అంబటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!