Site icon NTV Telugu

Ambati Rambabu : అవగాహన లేకపోవడంతోనే శ్రీవాణి ట్రస్ట్ పై రాజకీయ అరోపణలు చేస్తున్నారు

Ambati Rambabu

Ambati Rambabu

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ ని రాజకీయ ఆరోపణలుకు ఉపయోగించుకోవడం మంచి పద్దతి కాదని ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవగాహన లేకపోవడంతోనే శ్రీవాణి ట్రస్ట్ పై రాజకీయ అరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందు ధార్మిక ప్రచారంలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులును టిటిడి వినియోగిస్తూందని, శ్రీవాణి ట్రస్ట్ విధానాలతో దళారి వ్యవస్థకు టీటీడీ చెక్ పెట్టిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Also Read : Cockroach: మహిళ జీవితాన్ని నాశనం చేసిన బొద్దింక.. ఇల్లు, ఉద్యోగం వదిలి పరార్

కాగా, మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్‌పై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా టీటీడీపై విమర్శలు చేస్తున్నారు. గొప్ప ఆశయంతో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. నూతన ఆలయాల నిర్మాణ, శిథిలావస్థలో ఉన్న ఆలయాల ఆధునీకరణ, ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు వినియోగిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టడం వల్ల దళారీ వ్యవస్థ తగ్గింది. ట్రస్ట్‌పై విమర్శలు చేస్తున్న వారికి ఇకనైనా బుద్ధి రావాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : Warangal: కన్నీటి సంద్రంలో రైతన్న.. చెత్తకుప్పకు చేరిన లక్షలు విలువ చేసే టమాటా..!

Exit mobile version