NTV Telugu Site icon

Ambati Rambabu : పెద్దిరెడ్డిపై ఉన్న రాజకీయ కక్షతో దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు..

Ambati

Ambati

టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో.. ఇవాళ ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. నాడు నేడు అంటూ టీడీపీ హాయంలో పోలవరం పరిస్థితిని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పోలవరం అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నిన్న చంద్రబాబు యుద్ధభేరి కార్యక్రమంలో పోలవరం పై మాట్లాడిన అన్ని విషయాలు అబద్ధాలేనన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు వైసీపీ అధికారంలో వచ్చాక ఏం చేశాం అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్ట్ ల పై చిత్త శుద్ధితో కాకుండా ఎన్నికల ప్రచరంగా పర్యటనలు చేస్తున్నారన్నారు. పెద్దిరెడ్డి పై ఉన్న రాజకీయ కక్షతో దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read : Phone Charging : ఫోన్ ను చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. లేకుంటే పేలిపోతుంది..!

ఏవడ్రా నువ్వు అంటూ సంబోధిస్తూ మాట్లాడుతున్నారని, మేము అడిగిన మూడు ప్రశ్నలకు ఇప్పటివరకు మాజీ ముఖ్య మంత్రి, అప్పటి ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పలేదన్నారు అంబటి రాంబాబు. డయాఫ్రమ్ వాల్ ముందుగా నిర్మించడంతో జరిగిన తప్పిదం ప్రాజెక్ట్ కు శని పట్టినట్టు పట్టిందని, తన కాంట్రాక్టర్ కు ప్రాజెక్ట్ అప్పగించడం ద్వారా వేలకోట్లు దోచుకునేందుకు సిద్ధ పడ్డారని ఆరోపించారు. 2013-14 రేట్ల పై 2016లో మేము పనులు పూర్తి చేస్తాం అంటూ కేంద్రం నుంచి ప్రాజెక్ట్ ను తీసుకున్నారని, 20,398కోట్లకు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని తీసుకోవడం చారిత్రాత్మక తప్పిదన్నారు. డబ్బు కాజెద్ధాం అని ప్రాజెక్ట్ తీసుకున్నారని, ప్రణాళిక లేకుండా టీడీపీ హయాంలో చేసిన పనుల కారణంగా 2019-20 లో వచ్చిన వరద వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు.

Also Read : Vijayasai Reddy : ఐఐఎంలలో 60 శాతం బీసీ, ఎస్సీ కోటా పోస్టులు ఖాళీ.. భర్తీపై దృష్టి సారించాలి

చంద్రబాబు నిన్న నిలబడి మాట్లాడిన కాఫర్ డ్యామ్ వైసీపీ హయాంలో పూర్తి అయిందని, ప్రాజెక్ట్ ఎత్తు 45.72 నుంచి తగ్గించడానికి వీలు లేదు.. మొదటి దశలో 41.15 మీటర్లు నీటిని నిలబెడతారన్నారు. 41.15కు తగ్గించారు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.. ఎంత నీరు పై నుంచి వస్తె అంతా కిందికి వెళ్ళిపోతుంది.. గోదావరి పుట్టిన తర్వాత 50లక్షల క్యూసెక్కుల నీరు రాలేదు.. 194 టీఎంసీ లకు గాను 41.15 వద్ద 119టీఎంసీ ల నీరు నిలబెడతారు.. ఇబ్బందులు లేకుంటే తరవాత లెవెల్ కు నీరు నిలబెడతారు.. 2017-18ప్రకారం 55వేల కోట్లు అవుతుంది అనే అంచనాలు కేంద్రానికి పంపించాము.. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.. మేము అధికారంలోకి వస్తె ప్రతి ఏకరానికి నీరు ఇస్తా అంటున్న చంద్రబాబు 14ఏళ్లు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేక పోయారు.. లోకేష్ యువగళం వల్ల టిడిపి గ్రాఫ్ మరింత తగ్గుతుందని చంద్రబాబు వేరే రూటులో తిరుగుతున్నారు..పులివెందుల, గుండ్లకమ్మ వెళ్తారు.. ఆంబోతు రాంబాబు అంటారు.. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దూషిస్తారు’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.