Ambati Mounika: మీకు అంత అహకారం పనికిరాదు.. ఎమ్మెల్యేపై అంబటి మౌనిక సీరియస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Mounika: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Varanasi Update: రాజమౌళి మరో మాస్టర్ ప్లాన్.. వారణాసి మొత్తం ఐమ్యాక్స్ కాదట!
Also Read
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా మాధవికి ఇంతటి అహంకారం ఎక్కడిదని మౌనిక ప్రశ్నించారు. ఒక పక్క క్షమాపణ చెప్పడానికి వచ్చామని అంటూనే, మరోపక్క మళ్లీ దాడి చేస్తామంటూ లైవ్ ప్రెస్మీట్లలో బెదిరించడంపై ఆమె మండిపడ్డారు. వ్యవస్థల కన్నా తామే పవర్ ఫుల్ అని ఎమ్మెల్యే భావిస్తున్నారా అని నిలదీశారు. మీ నాన్న మాట్లాడే మాటలతో మీ పిల్లలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అని తనను ప్రశ్నించిన గల్లా మాధవికి మౌనిక గట్టి కౌంటర్ ఇచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని, ఇళ్లపై దాడులు చేయమని మీరు మీ పిల్లలకు సందేశం ఇస్తున్నారా? అని అన్నారు. తాము ఎప్పుడూ వ్యవస్థలకు లోబడి ఉండాలనే చెబుతామని అన్నారు. ఇంకా విదేశాల్లో చదువుకుని వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలను ప్రక్షాళన చేస్తారని అందరూ భావిస్తే, ఆయన ఆధ్వర్యంలోనే ఇటువంటి కలుషిత రాజకీయాలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకే ఈ హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు.
సుమారు వందల మంది ఇంటిని చుట్టుముట్టి రాళ్లు విసురుతున్నా, కత్తులతో బెదిరిస్తున్నా, గునపాలతో గోడలు పొడుస్తున్నా నాన్న ధైర్యంగా ఇంట్లోనే కూర్చున్నారని మౌనిక గుర్తు చేశారు. చట్టం మీద ఉన్న నమ్మకమే ఆయనకు ఆ ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన వారు కూడా ఓట్ల కోసం ఆయన వద్దకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను లా అండ్ ఆర్డర్ కాపాడమని అడిగితే తప్పేంటని నిలదీశారు.
Planetary Parade: ఆకాశంలో అద్భుతం.. “షష్ట గ్రహ కూటమి”.. ఎప్పుడు చూడాలంటే..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ ఇంటికి పరామర్శకు వచ్చిన సమయంలో బంగారం, వెండి ఆభరణాలు పోయాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. అది కేవలం విషయాన్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్న ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఈ కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అంబటి మౌనిక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచుతోంది.
తాజావార్తలు
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!