Site icon NTV Telugu

Mahesh Babu-Venkatesh: చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్.. ‘ఏఎంబీ విక్టరీగా’ థియేటర్!

Mahesh Babu Venkatesh

Mahesh Babu Venkatesh

Mahesh Babu-Venkatesh Theatre: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో ఉన్న ‘సుదర్శన్‌’ థియేటర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో సినిమా రిలీజ్ ఉందంటే.. అక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. భారీ కటౌట్లు, వందల కొద్ది ఫెక్సీలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి, ఆయన ఫ్యాన్స్‌కి సుదర్శన్‌ థియేటర్‌ చాలా సెంటిమెంట్. తన సినిమా మొదటి షోను ఫ్యాన్స్‌తో కలిసి మహేష్ బాబు సుదర్శన్‌లోనే చూస్తారు. ఇటీవల వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాకు సెలబ్రేషన్స్‌ను ఫ్యాన్స్ వీరలెవల్లో చేశారు. ఈ సెలబ్రేషన్స్‌ రానున్న రోజుల్లో మరింత ఎక్కువ కానున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.

Also Read: Chiranjeevi vs Ravi Teja: చిరంజీవి వర్సెస్ రవితేజ.. గెలుపు ఎవరిదో!

2010లో అనివార్య కారణాల వల్ల సుదర్శన్‌ 70MM మూతపడింది. ఇప్పుడు దానిని మహేశ్‌ బాబు రీఓపెన్‌ చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ పేరుతో 7 స్క్రీన్స్‌ ఉండేలా సూపర్ స్టార్ భారీ మల్టీఫ్లెక్స్‌ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బిల్డింగ్ వర్క్ పూర్తయింది. అయితే ఈ థియేటర్ బిజినెస్‌లోకి తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా వచ్చారట. దాంతో సుదర్శన్‌ థియేటర్‌కు ‘ఏఎంబీ విక్టరీగా’ పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version