అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు నిజానికి అంతర్జాతీయ సంస్థలైనా, ఇండియన్ మార్కెట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ రెండు సంస్థలకు సంబంధించి ముంబైలో కార్పొరేట్ ఆఫీసులు సెటప్ చేసి, తెలుగు సహా మిగతా అన్ని రీజనల్ భాషలకు సంబంధించి స్పెషలైజ్డ్ టీమ్స్ నియమించారు. వాళ్లు కొనే ప్రాజెక్ట్స్, స్పెషల్ ఐస్ టీమ్స్ అప్రూవ్ చేసిన తర్వాత, ఆయా సంస్థల హెడ్స్ ఫైనల్ చేసి కొనుగోలు చేస్తారు. ఒక రకంగా, ఈ రెండు సంస్థలే క్రేజీ సినిమాలను కొనుగోలు చేస్తూ ఓటీటీ మార్కెట్‌ను పూర్తిగా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సంస్థలు మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
READ MORE: China – Bhutan: భూటాన్ భూమిపై చైనా కన్ను.. డ్రాగన్ చూపు పడితే నాశనమే!
అదేమిటంటే, ఇప్పటివరకు ఈ సంస్థలు తమ ఒరిజినల్స్ అంటూ కొంతమంది నిర్మాతలతో కలిసి ఒరిజినల్స్ రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఆ ఒరిజినల్స్‌ను థియేటర్లలో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈటీవీ విన్ ఒరిజినల్‌గా రూపొందిన లిటిల్ హార్ట్స్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి మంచి ప్రాఫిట్స్ సంపాదించారు. అదే కోవలో, ఇప్పుడు అమెజాన్ సంస్థతో పాటు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కూడా అదే బాటలో నడవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీ స్టూడియోస్ అయితే ఈ మేరకు తెలుగులో కొన్ని సినిమాలు సహనిర్మాతగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లింది. అదే బాటలో, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు నెట్‌ఫ్లిక్స్ కూడా రంగంలోకి దిగబోతోంది.