Site icon NTV Telugu

Amazon Great Republic Day Sale 2026: షాపింగ్ లవర్స్ గెట్ రెడీ.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆ రోజే ప్రారంభం

Amazon

Amazon

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్ కు రెడీ అయ్యింది. ఆన్ లైన్ షాపింగ్ చేసే వారు మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ లిస్ట్ ను రెడీ చేసుకోండి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 తేదీలను ప్రకటించారు. ఈ సేల్ జనవరి రెండవ వారంలో ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల నుంచి ఫ్యాషన్, గృహ, వంటగది ప్రొడక్ట్స్ పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్స్, లిమిటెడ్ పిరియడ్ డీల్స్ ఉండనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

Also Read:Toxic Remunerations: ‘టాక్సిక్’ తారలకు భారీ రెమ్యూనరేషన్స్.. కియారా, నయనతారకు ఎంతో తెలుసా?

అమెజాన్ ప్రకారం , గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 16న ప్రారంభమవుతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, కెమెరాలు, టూల్స్, ఆడియో డివైజెస్, వేరియెబుల్స్, గృహ, వంటగది ఉపకరణాలు, ఆటో ఉపకరణాలు, హెల్త్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫ్యాషన్, పాదరక్షలు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఫర్నిచర్, కిరాణా, బేబీ కేర్, పెంపుడు జంతువుల ఉత్పత్తులు వంటి విభాగాలలో ఆఫర్‌లు ఉంటాయి. వేలాది ఉత్పత్తులపై డీల్‌లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

Also Read:JanaNayagan : మద్రాస్ హైకోర్టులో విజయ్ దళపతి సినిమాకు బిగ్ రిలీఫ్.

ఈ సేల్ సమయంలో, iQOO, OnePlus, Samsung, Xiaomi, Apple, Sony, TCL, LG, HP, Boat వంటి ప్రధాన బ్రాండ్ల ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్లు ఉండనున్నాయి. అదనంగా, Amazon మైక్రోసైట్ ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే కొనుగోళ్లకు 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ SBI కార్డులను ఉపయోగించి చేసే EMI లావాదేవీలకు కూడా వర్తిస్తుంది.

Exit mobile version