బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ వాచ్ ను ఫాస్ట్ ట్రాక్ కంపెనీ అందుబాటులోకి తీసుకవచ్చింది. రివోల్ట్ ఎఫ్ఎస్1 పేరుతో వస్తునన్ ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ సౌకర్యాన్ని కల్పించింది. సూపర్ ఫీచర్లతో అమేజ్ ఫిట్ జీటీఆర్ మినీ వాచ్ ను లాంఛ్ చేసింది. సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్ తో వస్తుండడం వల్ల ఎలాంటి శబ్దం లేకుండా క్లియర్ గా కాల్స్ చేసుకోవచ్చు.
Also Read : Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపైకి 10 వేల మంది పోలీసుల.. గన్స్, పెట్రోల్ బాంబులు స్వాధీనం
ఈ స్మార్ట్ వాచ్ సుమారు 100కు పైగా స్పోర్ట్ మోడ్స్ ను కలిగి ఉంది. దీనిలో ఉన్న 2.5x నైట్రో ఫాస్ట్ ఛార్జింగ్ తో ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. వీటితో పాటు ఏఐ వాయిస్ అసిస్టెంట్ సౌకర్యాన్ని కల్పించారు. గూగుల్ అసిస్టెంట్ తో పాటు సిరి కూడా ఇందులో పనిచేస్తోంది. స్మార్ట్ నోటిఫికేషన్స్ పాటు వాతావరణ అప్ డేట్స్, అలారం క్లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ధర రూ. 1,695 గా నిర్ణయించారు. ఈ వాచ్ మార్చ్ 22 నుంచి ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్ రంగుల్లో ఈ రిలీజ్ కానుంది.
Also Read : Benefits Of Amla : ఉసిరిని ‘సూపర్ ఫుడ్’ అని అందుకే అంటారు
అమేజ్ ఫిట్ తన జీటీఆర్ స్మార్ట్ వాచ్ సిరీస్ ను కొనసాగిస్తూ జీటీఆర్ మినీని తీసుకురాబోతుంది. బడ్జెట్ ధరలో జీపీఎస్ సపోర్ట్ తో 14 రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. జీటీఆర్ మినీ లైట్ వెయిట్ డిజైన్, స్టెయిన్ లెస్ స్టీల్ ప్రేమ్ తో రూపొందించారు. 1.28 అంగుళా అమోలెడ్ డిస్ ప్లేతో కర్వ్ తో డ్ గ్లాస్, హెచ్ డీ రెజల్యూషన్ తో వస్తుంది. ఇందులో 80వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. యాపిల్ వాచ్ లో లాగా మూడు ఫోటోలను వాచ్ ఫేసెస్ గా పెట్టుకోవచ్చు.. ఫైవ్ శాటిలైట్ పొజిషనింగ్ వ్యవస్థతో జీపీఎస్ సౌకర్యాన్ని కల్పించారు. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, ప్లీన్ ట్రాకర్ కూడా ఉన్నాయి.
Also Read : PM Narendra Modi: భారత ప్రజాస్వామ్య విజయం కొందరిని బాధపెడుతోంది.. రాహుల్ గాంధీకి కౌంటర్..
ఈ స్మార్ట్ వాచ్ లో రన్నింగ్, ఔట్ డోర్ సైక్లింగ్, వాగింగ్ లాంటి 120 స్పోర్ట్ మోడ్స్ యాక్టివిటీస్ ఉంటాయి. మీరు చేసిన వర్కౌట్ల వివరాలను ఇతరులతోనూ షేర్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ తో స్ట్రావా, రిలీవ్, గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ యాప్ లను వినియోగించవచ్చు. ఇది జెప్ ఓఎస్ 2.0తో నడుస్తుంది. సింగిల్ చార్జ్ తో 14 రోజుల పాటు, బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆన్ చేస్తే సుమారు 20 రోజుల పాటు పనిచేస్తుంది. ఇది 5ఏటీఏం వాటర్ రెసిస్టేన్స్ ను కలిగి ఉంది.