Site icon NTV Telugu

Amaravati Drone Summit 2024: డ్రోన్‌ సమ్మిట్‌కు 6929 రిజిస్ట్రేషన్లు.. ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా?

Drone Summit

Drone Summit

Amaravati Drone Summit 2024: రేపు, ఎల్లుండి డ్రోన్ సమ్మిట్ సీకే కన్వెన్షన్‌లో జరుగుతోందని ఏపీ ప్రభుత్వ సెక్రటరీ సురేష్ పేర్కొన్నారు. నాలుగు కేటగిరీలలో రిజిస్ట్రేషన్ ఆన్ లైన్‌లో చేశామన్నారు. డెలిగేట్స్, డ్రోన్, హ్యాకథాన్, స్పీకర్స్ కేటగరీల కింద రిజిస్ట్రేషన్లు చేశామని చెప్పారు. 6929 రిజిస్ట్రేషనులు వచ్చాయని.. రెండు రోజుల క్రింద రిజిస్ట్రేషన్లు ఆపేశామన్నారు. 50 ఎగ్జిబిషన్లు ఉంటాయన్నారు. 1711 డెలిగేట్స్, 1306 విజిటర్స్ ఇప్పటిదాకా ఫైనల్ చేశామన్నారు. హ్యాకథాన్‌లోని 9 థీమ్స్‌ను 4 కేటగిరీలుగా చేసి ప్రతీ కేటగిరీలో మూడు ప్రైజ్‌లు ఉంటాయన్నారు. ఇలా ప్రైజ్ మనీగా రూ.24 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు ఇందులో పాల్గొంటారన్నారు. ఐఐటీ, ఇండస్ట్రీ, ప్రభుత్వం నుంచీ ఎక్సపర్ట్‌లు ఉంటారన్నారు.

Read Also: Andhra Pradesh: మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. కొత్త పథకానికి శ్రీకారం

క్యూసీఐ ఒక క్వాలిటీ సర్టిఫికేషన్ ఏజెన్సీతో ఒక ఎంవోయూ చేస్తున్నామని.. దీనితో డ్రోన్ కార్పొరేషన్ కూడా ఒక సర్టిఫై చేసే ఏజెన్సీ అవుతుందన్నారు. ఐఐటీ తిరుపతితో నాలెడ్జ్ పార్టనర్‌గా ఒక ఎంవోయూ చేస్తున్నామన్నారు. ఏపీని డ్రోన్ పాలసీ కోసం ఒక ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటామన్నారు. 5500 డ్రోన్లతో చేసే దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఈవెంట్ ఇది అని వెల్లడించారు. డ్రోన్ హ్యాకథాన్ విన్నర్స్‌కు ప్రైజ్ అక్కడే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక ట్రాఫ్ట్ కాన్సెప్ట్ పేపర్ కూడా ఒకటి ఉంటుందన్నారు. దానిని ఇన్వెస్టర్స్‌కి కూడా ఇస్తామన్నారు. వచ్చే సంవత్సర కాలంలో 20వేల మందికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు. 24 డ్రోన్ వినియోగం అవసరం ఉన్న సెక్టార్లు ఉన్నాయన్నారు. 2123 ఐఐటీలు, 372 జేఎన్‌టీయూ కాలేజీలకు ఇన్విటేషన్ ఇచ్చామన్నారు. డ్రోన్ ట్యాక్సీలు కూడా త్వరలో వస్తాయన్నారు. డ్రోన్ కార్పొరేషన్‌లో ఇద్దరే ఉద్యోగులు ఇప్పటిదాకా ఉన్నారన్నారు. ఈ కార్పొరేషన్‌ను గత రెండేళ్ల పాటు పట్టించుకోలేదన్నారు. డెలిగేట్స్, స్పీకర్లు 2వేల మంది రావచ్చని వెల్లడించారు.

 

Exit mobile version