Amalapuram: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు చింతా అనురాధా.. అయితే, ఆమె భర్త టీఎస్ఎన్ మూర్తి.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.. పి.గన్నవరం అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారట మూర్తి.. టికెట్ ఇస్తే.. బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారట.. దీని కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమలాపురం ఎంపీ, పి.గన్నవరం అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు మూర్తి.. వైసీపీలో టికెట్ దొరకకపోవడంతో.. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు.. ఇక, తాగాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిశారు అమలాపురం సిట్టింగ్ ఎంపీ చింతా అనూరాధ భర్త టీఎస్ఎన్ మూర్తి.. పురంధేశ్వరిని మర్యాదపూర్వకంగానే కలిసినట్టు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అయిన తాళ్ల సత్యనారాయణ మూర్తి చెబుతున్నారు. మరి.. పురంధేశ్వరితో ఎలాంటి చర్చలు జరిగాయి.. బీజేపీ నుంచి ఎలాంటి హామీ లభించింది.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమేనా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.. అయితే, సిట్టింగ్ ఎంపీగా ఉన్న తన భార్యకు వైసీపీలో సీటు దక్కకపోవడం.. పి.గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. బీజేపీలో చేరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.