DMR Sekhar Resigns: జనసేనకు మరో షాక్‌.. పార్టీకి అమలాపురం ఇంఛార్జ్‌ గుడ్‌బై

Dmr Sekhar

Dmr Sekhar

DMR Sekhar Resigns: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు ఎన్నికల కోలాహలం.. మరోవైపు రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రాజీనామాలు, వలసలు కొనసాగుతూనే ఉండగా.. ఇప్పుడు జనసేన పార్టీకి మరో షాక్‌ తగిలింది.. ఇప్పటికే కొందరు నేతలు.. టికెట్‌ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయగా.. ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు.. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్‌ డీఎంఆర్ శేఖర్.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు.. ఈ మేరకు తన రాజీనామా లేఖను జనసేన పార్టీ అధిష్టానానికి పంపించారు శేఖర్‌.. 2019 ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకిదిగి ఓటమిపాలైన శేఖర్‌.. ఈ సారి అమలాపురం పార్లమెంట్ లేదా అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించారు.. చివరకు ఆయనకు నిరాశే మిగిలింది.. దీంతో, పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. మరి, ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఏ పార్టీలో చేరతారు? అనేది తేలాల్సిన అంశం.

Read Also: LSG vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్..

×
×
Ad

కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. టికెట్ దక్కన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం.. సొంత పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు.. ఈ పరిణామాలు కూడా మరికొన్ని స్థానాల్లో చిచ్చు పెట్టాయి.. ఎన్నికలకు సమీపిస్తున్నా.. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా నేతలు గ్రూప్ లు కట్టడం.. ప్రధాన పార్టీలకు ఇబ్బంది కరంగా మారిన విషయం విదితమే..