Allu Arjun : పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ను మరింతగా పెంచుకున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. పుష్ప 2 సినిమాలోని విజయంతో బన్నీ అభిమానులలో తదుపరి ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది. కాగా, పుష్ప 3 సినిమాను వెంటనే చేయకపోవడం, తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో చేయనున్నాడో అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది.
Read Also : Minister Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి గన్‌మెన్‌పై సస్పెన్షన్ వేటు..
ఈ నేపథ్యంలో బన్నీ తదుపరి సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పని చేయనున్నాడని సమాచారం అందింది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించబడినప్పటికీ, ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా బన్నీతో సినిమా చేయాలని అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, అట్లీ చెప్పిన కథ బన్నీకి నచ్చకపోవడంతో, అది వేరే హీరోతో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తోనే చేయబోతున్నాడని పటిష్టంగా వార్తలు వస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి ఈ సినిమాకు సంబంధించి పూర్తి నెరేషన్ ఇచ్చారని తెలుస్తోంది.
Read Also : NABARD State Focus Paper: వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలి: మంత్రి తుమ్మల
ఈ సినిమా ఒక మైథలాజికల్ పీరియడ్ డ్రామాగా రూపొందనుంది. ఇందులో బన్నీ కొత్తగా కనిపించే లుక్‌లో నటించనున్నట్లు చెప్తున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంతకు ముందు “జులాయి”, “సన్నాఫ్ సత్యమూర్తి”, “అల వైకుంఠపురములో” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బన్నీ-త్రివిక్రమ్ కాంబో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరచింది. అందుకే ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో ఎక్కడా తగ్గని ఆసక్తి మరియు అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా ఇంకా అధికారిక ప్రకటనలు, షూటింగ్ ప్రారంభం గురించి క్లారిటీ అందుకోవాల్సి ఉంది.