Site icon NTV Telugu

R.Krishnaiah : బీసీ కులగణననతో పాటు.. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

R Krishnaiah

R Krishnaiah

బీసీ కులగణననతో పాటు.విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఛలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా విద్యార్థులతో కలిసి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్.కృష్ణయ్య.పలువురు బీసీ సంఘాలతో కలిసి ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ఇంతవరకు కులగణన చేయడం లేదని.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బిసి ల రిజర్వేషన్లు 42 శాతం కు పెంచడం లేదని కృష్ణయ్య ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధిక్కరిస్తారా అని ప్రశ్నించారు. కామారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా పంచాయితీ రాజ్ మున్సిపల్ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు 20 నుండి 42 శాతం కు పెంచాలని డిమాండ్ చేశారు. మరో వైపు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించమని. విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో పోరాడుతమన్నారు. బీసీ సమస్యలపై రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే… రాబోయే రోజులలో లక్ష మంది విద్యార్థులతో సెక్రటేరియట్ ని ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

XEC Covid Variant: కలవరపెడుతున్న కొత్త వేరియంట్.. దీని లక్షణాలు ఏమిటి..?

Exit mobile version