NTV Telugu Site icon

Almonds Soaked In Honey: రోజూ తేనెతో నానబెట్టిన బాదంపప్పును తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

Almond

Almond

Almonds Soaked In Honey: ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం గురించి మనం తరుచూ వినే ఉంటాము. అయితే, తేనెలో నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని మీకు తెలుసా..? ఇకపోతే బాదం, తేనె రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటి కలయిక శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే తేనెలో నానబెట్టిన బాదంపప్పు తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం. బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం ఇంకా అనేక ఇతర ఖనిజాలకు మంచి మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. అలాగే బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. ఇక తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మరి తేనెలో నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తే..

Also Read: Life Certificate For Pensioners: ఆ పని చేయలేదా? అయితే ఇక పింఛను అందుకోలేరు

గుండె ఆరోగ్యానికి మేలు:

బాదంపప్పులో ఉండే అసంతృప్త కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.

బరువు తగ్గడానికి:

బాదంపప్పులో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల మీరు చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దాంతో మీరు తక్కువగా తింటారు. తేనెలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, దీన్ని మితంగా తినడం వల్ల బరువు తగ్గవచ్చు.

Also Read: ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

రోగనిరోధక శక్తి బూస్టర్:

తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

చర్మానికి ప్రయోజనకరం:

తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మొటిమలు, మచ్చలు ఇంకా ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ చర్మానికి తేమను అందిస్తుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

బాదంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. తేనెలో ప్రోబయోటిక్స్ ఉడడంతో అవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.