Site icon NTV Telugu

Alluri Missing Girls : అల్లూరి జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు సేఫ్‌

Alluri

Alluri

Alluri Missing Girls : అల్లూరి జిల్లా కించూరు ప్రాంతంలో నాలుగు రోజులుగా అదృశ్యమై కుటుంబాలను ఆందోళనకు గురిచేసిన ఇద్దరు బాలికలు చివరకు సురక్షితంగా దొరికారు. పెదబయలు ఆశ్రమ పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థిని వసంత, 5వ తరగతి విద్యార్థిని తేజ.. పాఠశాల నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళితే తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఇంటికి వెళ్లకుండా కించూరు గ్రామ శివారులోని కొండ గుహ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే గత నాలుగు రోజులు గడుపుతూ, గుహ పరిసరాల్లో లభించిన కందలు, మూలాలు తింటూ, నీటితో దాహం తీర్చుకుంటూ, చలి వణుకులతో కష్టాల్లో ఉండిపోయారు.

Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?

ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో గుహ వద్దకు వెళ్లిన గ్రామస్థులు బాలికలను గుర్తించి వెంటనే పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇప్పటికే తమ పిల్లల కోసం తీవ్రంగా వెతుకుతున్న తల్లిదండ్రులు సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని బాలికలను కౌగిలించుకున్నారు. పిల్లలు క్షేమంగా కనిపించడంతో తల్లిదండ్రుల కళ్లలో ఆనందబాష్పాలు పొంగిపోయాయి. ఇటీవలి కాలంలో అల్లూరి జిల్లాలో జరిగిన పలు బాలికల పై దాడులు, అదృశ్య ఘటనలు ప్రజల్లో ఆందోళనను పెంచిన నేపథ్యంలో వసంత, తేజలు సురక్షితంగా దొరికిన విషయం స్థానికులకు ఊరటనిచ్చింది.

Vida VX2 Go: విడా VX2 Go కొత్త వేరియంట్ విడుదల.. 3.4 kWh బ్యాటరీ.. సింగిల్ ఛార్జ్ తో 100KM రేంజ్

Exit mobile version