Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alluri District Blast: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట సమీపంలోని మైనింగ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఓ ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న ఓ గుత్తేదారుకు సంబంధించిన వాహనంలో డీజిల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి దారితీసిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో మృతి చెందినవారి వివరాలు, ప్రమాదం జరిగిన తీరుపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కానీ, పేలుడు ధాటికి మృతదేహాలు చల్లాచదరుగా.. దూరంగా ఎగిరిపోయిన దృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.. మరోవైపు, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు..
Also Read
- Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
- RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
- Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
- Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
తాజావార్తలు
-
Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. నలుగురు మృతి
-
Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
-
Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
-
AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!