NTV Telugu Site icon

Arya: నా జీవితాన్నే మార్చేసిన సినిమా.. ఎమోషనలైన బన్నీ..

Arya Alluarjun

Arya Alluarjun

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా, హీరోయిన్ గా అను మెహతా. మే 7, 2004న థియేటర్లలో విడుదలైన ఆర్య సినిమా సూపర్ హిట్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ట్రైయాంగిల్ ప్రేమకథతో పాటు ఓదార్పునిచ్చే పాటలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతకు బాగా నచ్చింది. 20 సంవత్సరాల క్రితమే 30 కోట్ల వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం.

Also read: Drinkers In TS: మందు బాబులకు అన్యాయం చేస్తే దబిడి దిబిడే.. తాగుబోతుల సంఘం కామెంట్స్..

ఈ సందర్భంగా, బన్నీ ఆ రోజుల గురించి భావోద్వేగ పోస్ట్‌ను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. “ఆర్య సినిమాకు 20 ఏళ్లు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది నా జీవితాన్ని మార్చిన క్షణం. నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. స్వీట్‌ మెమొరీస్‌., అంటూ అప్పటి ఫోటోలను పంచుకున్నాడు. శివ బాలాజీ, రాజన్ దేవ్, సునీల్, వేణు మాధవ్ లాంటి అనేకమంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందించారు. దిల్ రాజ్ నిర్మాత.

Also read: RR vs DC: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా బరిలోకి రాజస్థాన్ రాయల్స్..

ఇదిలా ఉంటే, ఆర్య సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమాలోని నటులంతా కలిసి రీ యూనియ‌న్ గా చేరి స్పెషల్ సెలబ్రేషన్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆర్య చిత్ర బృందం, మీడియా, పలువురు ప్రముఖుల సమక్షంలో ఆర్య సినిమా 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. ఈ వేడుకకు అల్లు అర్జున్, సుకుమార్, ఆర్యలో పనిచేసిన దిల్ రాజు తదితరులు ప్రముఖులు హాజరుకానున్నారు.

Show comments