రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన బ్యాచిలర్ జీవితానికి ఎండ్ కార్డ్ వేసిన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.వీరి పెళ్లి వేడుకలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మరియు అల్లు శిరీష్ ఎంతగానో సందడి చేశారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లో వీరు ముగ్గురు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు శిరీష్ పెట్టిన ఇన్ స్టా స్టోరీ నెట్టింట తెగ వైరలవుతుంది. తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫన్నీ రీల్ శిరీష్ షేర్ చేశాడు. అందులో తన ఏజ్ వాళ్లంతా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటే .. తాను మాత్రం జిమ్ లో ఇలా ఐదు కేజీల డంబెల్ ఎత్తుకుని వర్కౌట్లు చేస్తున్నాను అన్నట్లు ఓ రీల్ షేర్ చేసాడు..ప్రస్తుతం తన జీవితం కూడా అలాగే ఉందంటూ ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేశాడు. ప్రస్తుతం అతను షేర్ చేసిన ఇన్ స్టా పోస్ట్ తెగ వైరల్ అవుతుంది..
అల్లు శిరీష్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బ్రదర్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు శిరీష్. 2013లో గౌరవం సినిమా తో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు మరియు ఒక్క క్షణం లతో అలరించాడు. సినీ కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఓ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. శిరీష్ చివరగా ఊర్వశివో రాక్షసివో తో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కు యూత్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. దీంతో తన తరువాత సినిమా కోసం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ ఉంటాడు శిరీష్.తన సినిమాలకు సంబందించిన పోస్ట్ చేస్తూ నిత్యం ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటాడు..