Allu Arjun: చర్చగా మారిన అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. ఏంటి పుష్ప ఇది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి నేటితో తెరపడనుంది.. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు.. ప్రచారానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు.. ఈ సమయంలో.. ఏపీ రాజకీయాల్లో రెండు ఘటనలు హాట్ టాపిక్‌గా మారాయి.. ఒకటి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. తన బాబాయ్ పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతోన్న పిఠాపురంలో ఎంట్రీ ఇస్తే.. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. తన స్నేహితుడి కోసం నంద్యాలలో అడుగు పెట్టారు.. అయితే, ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్‌కు సోషల్ మీడియాలో శుభాకంక్షలు తెలిపిన బన్నీ.. ఇప్పుడు ఫ్రెండ్ కోసం ఎంట్రీ ఇవ్వడం చర్చగా మారింది.. దీనికి ప్రధాన కారణం.. జనసేనాని కూటమి తరపున ఉన్నారు.. ఆయనకు ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పి.. తమ ప్రత్యర్థి పార్టీలో ఉన్న తన స్నేహితుడి కోసం నంద్యాలలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది..
మొత్తంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సంఘీభావం తెలుపడానికి నంద్యాలకు వచ్చారు అల్లు అర్జున్… దీంతో బన్నీ వ్యవహారి శైలి హాట్ టాపిక్‌గా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. శిల్పా రవి భార్య నాగిని రెడ్డి.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి క్లాస్ మెట్స్ కావడంతో.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పారవికి ట్విట్టర్ లో ఆల్ ది బెస్ట్ చెప్పారు అల్లు అర్జున్.. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం కూడా సాధించారు.. ఇప్పుడు ఎమ్మెల్యే శిల్పా రవి అభ్యర్థన మేరకు నంద్యాలకు వచ్చారట అల్లు అర్జున్.. ఓవైపు మామయ్య పవన్ కల్యాణ్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. మరోవైపు.. స్నేహితుడి కోసం డైరెక్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం మాత్రం చర్చగా మారింది.. మెగా ఫ్యామిలీ మొత్తం జనసేనాని పవన్ కల్యాణ్ కోసం రంగంలోకి దిగి ప్రచారం చేస్తుంటే.. నువ్వు ఏంటి పుష్ప ఆయన ప్రత్యర్థుల కోసం వచ్చేశావు? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
కాగా, ఈ మధ్యే ఐకాన్ స్టార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారిన విషయం విదితమే.. మీ ఈ ప్రయాణంలో అనుకున్నది సాధించాలి.. సేవ చేయాలని, సేవకే అంకితం చేయాలని ఎంచుకున్న ఈ మార్గం పట్ల నాకెప్పుడూ గర్వంగానే ఉంటుంది.. ఓ కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను.. మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను అంటూ బన్నీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.. ఓవైపు మామయ్యకు మద్దతు ఇస్తూనే.. మరోవైపు.. స్నేహితుడికి కూడా సాయం అందిస్తున్నారు అల్లు అర్జున్.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!