అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప.. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. అయితేఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక టీజర్ మరియు పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు.. సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది.. టీమ్ ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ను రెడీ చేస్తున్నారు.. వచ్చే నెల ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఓ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. పుష్ప 1కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. పార్ట్ 2 లో కూడా అంతకు మించి అదిరిపోయే మ్యూజిక్ ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది..
అయితే బన్నీ బర్త్ డే సర్ ప్రైజ్ గా సాంగ్ ను రిలీజ్ చేస్తారా లేదా పోస్టర్ రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.. నెక్స్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.. ఇక ఈ సినిమాను ఆగష్టు 15 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు యూనిట్..ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరును పెంచారు.. బాహుబలి రేంజులో సినిమా ప్రమోషన్స్ చేయబోతున్నారు.. ఈ సినిమాకు పోటీగా స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి..