NTV Telugu Site icon

Allu Arjun Wax statue: ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్.. గంగోత్రి వచ్చిన రోజే మైనపు విగ్రహం అంటూ..!

8

8

ఐకాన్ స్టార్.. స్టైలిష్ స్టార్.. ఇలా పేరు ఏదైనా గుర్తొచ్చేది అల్లు అర్జున్ గురించి ప్రస్తుతం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా నుండి పుష్ప సినిమా వరకు ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శనీయం. ప్రతి సినిమాకి బన్నీ తన లుక్ ను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగిన విధానం అందరికీ తెలిసిందే. బన్నకి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా కేరళ, తమిళనాడు ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక పుష్ప సినిమా తర్వాత తాను ఇండియా స్థాయి దాటేసి విదేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా పుష్ప సినిమాలోని డైలాగ్స్, మ్యానరిజం, డాన్స్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. పుష్ప సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ స్టార్స్ కూడా పుష్ప నామస్మరణ చేశారంటే అతిశయోక్తి లేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ వీడియోలే దర్శనమిచ్చాయి.

Also read: MS Dhoni: సీఎస్కే కొత్త కెప్టెన్పై ఎంఎస్ ధోని స్టన్నింగ్ కామెంట్స్..

ఇక పుష్ప సినిమాలోని నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ కు లభించింది. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ తన కెరియర్లో మరో ప్రత్యేకమైన సంఘటన చోటుచేసుకుందని చెప్పవచ్చు. దుబాయ్ లోని మీడియం మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఈ ఘనత అతి కొంతమంది హీరోలకు మాత్రమే చోటు దక్కింది. ఈ మైనపు విగ్రహాన్ని మార్చి 28 గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కెరియర్.. అలాగే ఆయన అభిమానుల గురించి తలుచుకుంటూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

Also read: DSC Offer: తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు ఫ్రీగా రూ. 1500 బంపర్ ఆఫర్..!

ఈరోజు తన జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజని నా మొదటి చిత్రం గంగోత్రి రిలీజ్ కూడా ఈరోజు జరిగిందని.. అదే రోజు తన మైనపు విగ్రహాన్ని దుబాయిలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉన్నట్టు ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. ఇందులో భాగంగా తన 21 సంవత్సరాల సినీ ప్రయాణం మరపురానిదని తన ప్రయాణంలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా నా అభిమానుల ఆర్మీ అందించిన ప్రేమకు మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. తన అభిమానుల్ని రానున్న రోజుల్లో మరింత గర్వించేలా చేస్తానని ఎమోషనల్ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.