Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వారు చెప్పినట్లుగా పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ.400కోట్ల గ్రాస్ కలెక్షన్లతో అల్లు అర్జున్ తన పేరిట సరికొత్త రికార్డులు సృష్టించాడు. ‘పుష్ప-2’తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, పుష్ప-2 తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Read Also:Lawrence Bishnoi: “నాపై కుట్ర జరుగుతోంది”.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన వ్యాఖ్యలు
అల్లు అర్జున్ తన తర్వాత చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇక త్రివిక్రమ్ తమ కాంబోలో మరో హ్యాట్రిక్‌ను స్టార్ట్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. దీని కోసం ఆయన చాలా రోజులుగా తన తర్వాత ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడు. అయితే, ఈ సినిమాను మొదట సంక్రాంతి కానుకగా స్టార్ట్ చేయాలని భావించారట. కానీ, కొన్ని కారణాల వల్ల మార్చి.. అటుపై వేసవికి షిఫ్ట్ అవుతూ వచ్చిందట. ఇక ఇప్పుడు ఏకంగా జూన్‌లోనే ఈ సినిమాను స్టార్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో అల్లు అర్జున్‌కి తన తర్వాత సినిమా కోసం చాలా గ్యాప్ తప్పేలా లేదు అనే వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
Read Also:Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన.. షెడ్యూల్ వివరాలు..