Puspa 2 Trailer: పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఇకనుండి వైల్డ్ ఫైర్ అంటున్న ఐకాన్ స్టార్
- పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ ఈవెంట్
- పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఇకనుండి వైల్డ్ ఫైర్
- డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puspa 2 Trailer: ఆదివారం (నవంబర్ 17)న పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి అశేష సినీ అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నమస్తే.. బీహార్ ప్రజలందరికీ నా నమస్కారం అని, నేను ఎప్పుడు పాట్నా వచ్చినా.. మీరు చూపించే ప్రేమ, ఇచ్చే ఘన స్వాగతానికి పాట్నా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. మీ ప్రేమంతా ఇక్కడ కనబడుతోందని, చాలా ధన్యవాదాలు అంటూ తెలిపారు. అందరూ ఎలా ఉన్నారని అడుగుతూనే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఇకనుండి వైల్డ్ ఫైర్ అంటూ సినిమాలోని డైలాగ్ చెప్పాడు. అలాగే తన హిందీ కాస్త మీకు ఇబ్బంది కరంగా ఉండొచ్చని, తప్పులుంటే నన్ను క్షమించగలరని ఆయన అభిమానులను కోరాడు.
Read Also: Indian Railways: వరుడి రైలు ఆలస్యం..పెళ్లి సమయానికి చేర్చిన రైల్వే.. ఎలా సాధ్యమైందంటే..?
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
ఈ సందర్భంగా.. తాను ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాని, మీరు ఈ సినిమాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే దేశం మొత్తానికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాని గత మూడు సంవత్సరాలుగా మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాగా నిలిపినందుకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే, ఇది నా గొప్పతనం కాదని, ఇదంతా మీ వల్లే సాధ్యమని అన్నారు. అలాగే ఈ సందర్భంగా పుష్ప సినిమా టీమ్ మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, అలాగే ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణమని అన్నారు. ‘పుష్ప’ సినిమాను భారీ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. స్పాన్సర్స్‌కి, పోలీస్ సిబ్బందికి, అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు. ఇక చివరగా డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోందని, అందరికీ నచ్చుతుందని చెబుతూ.. థ్యాంక్యూ బీహార్, థ్యాంక్యూ పాట్నా అని ఆయన అన్నారు. ఇక స్టేజిని వీడే ముందు అభిమానులు డైలాగ్ చెప్పమని అడగగా..‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఇకనుండి వైల్డ్ ఫైర్..’ అంటూ డైలాగ్ చెప్పి అభిమానుల ముచ్చట తీర్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
Read Also: Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్.. 900 మంది పోలీసులు.. 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!