NTV Telugu Site icon

Allu Arjun: ఆ లెటర్‌ పూర్తిగా చదవలేదు.. కానీ ఆశ్చర్యపోయాను: అల్లు అర్జున్‌

Allu Arjun Statue

Allu Arjun Statue

Allu Arjun React on Wax Statue at Madame Tussauds: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘మేడమ్‌ టుస్సాడ్స్‌’ మ్యూజియంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ మైనపు విగ్రహన్ని ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్‌’ సినిమాలోని ఐకానిక్ పోజ్ ‘తగ్గేదేలే’తో అల్లు అర్జున్‌ మైనపు విగ్రహన్ని ఆవిష్కరించారు. దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా అల్లు అర్జున్‌ స్పందించారు. మేడమ్‌ టుస్సాడ్స్‌ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి ముందుగా తాను ఆశ్చర్యపోయానన్నారు.

టుస్సాడ్స్‌ దుబాయ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా పోస్ట్ చేసిన వీడియోలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ… ‘ఓరోజు నేను మా ఆఫీస్‌కు వెళ్లగానే అక్కడివారు వాళ్లందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. కొంతసమయానికి వారు నాకు ఓ లెటర్‌ ఇచ్చారు. లెటర్‌ పూర్తిగా చదవలేదు కానీ.. మేడమ్‌ టుస్సాడ్స్‌ అని చూడగానే ఆశ్చర్యానికి గురయ్యా. నా మైనపు విగ్రహం చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హెయిర్‌ పార్ట్‌ అద్భుతంగా తీర్చిదిద్దారు. నా మోస్ట్‌ ఐకానిక్‌ పోజుల్లో తగ్గేదేలే ఒకటి’ అన్నారు.

Also Read: Sunny Leone: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక ఇష్టం లేదని చెప్పి.. నా మనసు ముక్కలు చేశాడు: సన్నీ లియోన్‌

సినిమా, క్రీడలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఉంచుతారు. సింగపూర్‌, లండన్‌, దుబాయ్‌.. పలు వివిధ చోట్ల ఈ మ్యూజియం శాఖలున్నాయి. దుబాయ్‌లోని మ్యూజియంలో అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, షారుక్‌ ఖాన్‌.. వంటి సినీ ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.మహేశ్‌ బాబు, ప్రభాస్‌, కాజల్‌ వంటి టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఇప్పటికే ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. తాజాగా అల్లు అర్జున్‌ వీరి సరసన చేరారు. పుష్పతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌.. ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప-ది రూల్‌’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.