Allu Arjun: ఆ లెటర్ పూర్తిగా చదవలేదు.. కానీ ఆశ్చర్యపోయాను: అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun React on Wax Statue at Madame Tussauds: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్’ సినిమాలోని ఐకానిక్ పోజ్ ‘తగ్గేదేలే’తో అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఆవిష్కరించారు. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా అల్లు అర్జున్ స్పందించారు. మేడమ్ టుస్సాడ్స్ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి ముందుగా తాను ఆశ్చర్యపోయానన్నారు.
టుస్సాడ్స్ దుబాయ్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా పోస్ట్ చేసిన వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ… ‘ఓరోజు నేను మా ఆఫీస్‌కు వెళ్లగానే అక్కడివారు వాళ్లందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. కొంతసమయానికి వారు నాకు ఓ లెటర్ ఇచ్చారు. లెటర్ పూర్తిగా చదవలేదు కానీ.. మేడమ్ టుస్సాడ్స్ అని చూడగానే ఆశ్చర్యానికి గురయ్యా. నా మైనపు విగ్రహం చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హెయిర్ పార్ట్ అద్భుతంగా తీర్చిదిద్దారు. నా మోస్ట్ ఐకానిక్ పోజుల్లో తగ్గేదేలే ఒకటి’ అన్నారు.
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
Also Read: Sunny Leone: ఎంగేజ్మెంట్ అయ్యాక ఇష్టం లేదని చెప్పి.. నా మనసు ముక్కలు చేశాడు: సన్నీ లియోన్
సినిమా, క్రీడలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచుతారు. సింగపూర్, లండన్, దుబాయ్.. పలు వివిధ చోట్ల ఈ మ్యూజియం శాఖలున్నాయి. దుబాయ్‌లోని మ్యూజియంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్, షారుక్ ఖాన్.. వంటి సినీ ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.మహేశ్ బాబు, ప్రభాస్, కాజల్ వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ వీరి సరసన చేరారు. పుష్పతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప-ది రూల్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!