Site icon NTV Telugu

Pushpa 2 : సింగిల్ స్క్రీన్‌ టికెట్లకు కొత్త రేటు?

Pushpa2

Pushpa2

Pushpa 2 : భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా పుష్ప ది రూల్. అల్లు అర్జున్ స్టామినా ఏంటో ఈ సినిమాతో అర్థమవుతుందనేలా బజ్ క్రియేట్ అయింది. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉండనుంది. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది. అయితే సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఏపీలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్ప 2 ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తోడు మొదటి భాగం పుష్ప: ది రైజ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి నేపథ్యం ఉన్నందున, పుష్ప 2 టికెట్ ధరల విషయంలో కూడా భారీ మార్పులు తీసుకురానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో రేట్లు పెరగడం కొత్త విషయమేమీ కాదు. అయితే ఏపీలో రేటు ఎంత పెరుగుతుంది అనేది ఆసక్తికరమైన అంశం.

Read Also:Ponguleti Srinivas Reddy : మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుంది

గతంలో పుష్ప 1 విషయంలో నిర్మాతలకు సరైన సపోర్ట్ అందలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. అందుకే ఈసారి మంచి రేటు ఉండేలా చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 150-200 రూపాయల మధ్య ఉంటే, పుష్ప 2 కోసం ఈ రేటును 300 రూపాయల వరకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం ఎదుట ఉంచనున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు పెంచడం కోసం మైత్రి నిర్మాతలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఎలాగూ ఎక్స్ ట్రా షోలు బెన్ ఫిట్ షోలకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ సలార్ వంటి పాన్ ఇండియా చిత్రాలకు ఈ తరహా ప్రత్యేకతలు వర్తింపజేశారు. కానీ రూ.300 రేంజ్ లో ఇవ్వలేదు. దేవరకు 250 వరకు ఇచ్చారు. ఇక ఈసారి పుష్ప 2 కోసం ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read Also:Koti Deepotsavam 2024 Day 10: ‘దేశంలోనే ఒక భవ్య మహోత్సవం’.. కోటి దీపోత్సవం వేడుకకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పుష్ప 2 పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కారణంగా టికెట్ ధరల పెంపు నిర్ణయానికి సానుకూల స్పందన వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. అందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు, అల్లు అర్జున్ నటన, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. ప్రీమియమ్ రేట్లను కూడా ప్రేక్షకులు అంగీకరించే అవకాశాలున్నాయి. కానీ వీకెండ్ వరకు రూ.300 పెట్టి ఆ తరువాత తగ్గిస్తే లాంగ్ రన్ కలెక్షన్లు బాగుంటాయనే అభిప్రాయాలు వస్తున్నాయి.

Exit mobile version