Allu Arjun: పోలీసుల నోటీసులు.. లీగల్‌ టీమ్‌తో అల్లు అర్జున్‌ భేటీ

  • లీగల్‌ టీమ్‌తో అల్లు అర్జున్ భేటీ
  • రేపటి విచారణలో పోలీసు అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలపై చర్చ
  • లీగల్‌ ఒపీనియన్స్ తీసుకుంటున్న అల్లు అర్జున్.
Allu Arjun

Allu Arjun

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. తమ లీగల్‌ టీమ్‌తో అల్లు అర్జున్ సమావేశమయ్యారు. పోలీసుల తాజా నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. రేపు విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చిస్తున్నారు. తమ లీగల్ టీమ్‌ నుంచి లీగల్ ఒపీనియన్‌ను అల్లు అర్జున్‌ తీసుకుంటున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు అందించారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు హాజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న లీగల్ టీమ్ సభ్యులు.. పోలీసులు అడగబోయే ప్రశ్నలపై చర్చ జరుపుతున్నారు.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు

డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను రేపు పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్‌ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల బెయిల్‌ను మంజూరు చేసింది.

https://www.youtube.com/watch?v=ITqubGCDny8&t=188s