Site icon NTV Telugu

Dhurandhar : అల్లు అర్జున్ ప్రశంసలు అందుకున్న.. బాలీవుడ్ సినిమా

Alluarjun Surandar

Alluarjun Surandar

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విమర్శకుల నుంచి మరియు సినీ ప్రముఖుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఈ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా తన అభినందనలు తెలిపారు.

అల్లు అర్జున్ తన ట్వీట్‌లో, “ఇప్పుడే ధురంధర్ చూశాను. అద్భుతంగా రూపొందించారు. ఇందులో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు మరియు అమేజింగ్ సౌండ్‌ట్రాక్‌లు ఉన్నాయి. రణ్‌వీర్ తన నటనతో షోను దుమ్మురేపాడు. దర్శకుడు ఆదిత్య ధర్ మీరు పూర్తి స్వాగ్‌తో ఒక ఏస్ ఫిల్మ్ మేకర్‌గా ఈ చిత్రాన్ని విజయవంతం చేశారు. నాకు బాగా నచ్చింది! అందరూ వెళ్లి సినిమా చూడండి’ అని పేర్కొన్నారు. అయితే, భారతదేశంలో ఇంతటి భారీ ప్రశంసలు లభించినప్పటికీ, కీలకమైన గల్ఫ్ మార్కెట్ ఈ చిత్రానికి దూరం కావడం నిర్మాతల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.

‘ధురంధర్’ చిత్రం నిషేధానికి ప్రధాన కారణం దాని రాజకీయ సున్నితత్వం మరియు పాకిస్థాన్‌కు వ్యతిరేక సందేశం. ఈ చిత్రం నిర్వహించిన కొన్ని నిజ జీవిత రహస్య మిషన్ల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో ‘ఆపరేషన్ లయారీ’ వంటి భారత గూఢచార కార్యకలాపాలు ప్రధానంగా కనిపిస్తాయి. దీంతో ఈ సినిమా కథాంశం పాకిస్థాన్‌ను ప్రతికూలంగా చూపిస్తోందని, లేదా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉందని గల్ఫ్ సెన్సార్ బోర్డులు భావించాయి. ఈ కారణంగా, సినిమా ప్రదర్శనకు అనుమతి నిరాకరించబడింది. దీని కారణంగా ధురంధర’ చిత్రానికి అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

Exit mobile version