Site icon NTV Telugu

Happy Birthday Allu Arjun: అల్లు అర్జున్‌కు ఆ హీరోయిన్‌ ఎంతో ఇష్టం!

Allu Arjun

Allu Arjun

Aishwarya Rai is Allu Arjun’s Favourite Heroine: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అసవరం లేదు. ‘గంగోత్రి’తో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్.. ఆర్య, బన్నీ, దేశ‌ముదురు, వేదం, జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలా వైకుంఠపురంలో లాంటి హిట్ సినిమాలతో ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇక ‘పుష్ప-ది రైజ్‌’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్‌ ‘పుష్ప-ది రూల్‌’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నేడు అల్లు అర్జున్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం పుష్ప 2 టీజర్‌ విడుదల చేసింది.

అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్‌కు ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ అంటే ఎంతో అభిమానం. ఐశ్వర్య పెళ్లి అయినప్పుడు ఐకాన్ స్టార్ ఎంతో బాదపడ్డాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ స్వయంగా చెప్పాడు. అల్లు అర్జున్‌ పెళ్లి సందర్భంగా చాలా మంది అమ్మాయిలు తమ బాధను వ్యక్తపరుస్తూ.. బన్నీకి మెసేజ్‌లు చేశారట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు కూడా తెలుసని ఐశ్వర్య విషయం చెప్పాడు. ఐశ్వర్య రాయ్‌ 2007లో బాలీవుడ్‌ హీరో అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Pushpa 2 Teaser: 68 సెకండ్ల టీజర్.. చీరలో అల్లు అర్జున్!

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. 2021లో విడుదలైన పుష్ప సినిమాకు ఇది కొనసాగింపు. ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లింగ్‌ సిండికేట్‌కు నాయకుడిగా పుష్ప ఎలా ఎదిగాడని మొదటి భాగంలో చూపించగా.. సిండికేట్‌కు లీడర్‌ అయ్యాక పుష్పకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేది రెండో భాగంలో చూపించనున్నారట. ఈ సినిమాకు లెక్కల మాస్టార్‌ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కన్నడ సోయగం రష్మిక మందన్న ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఫహద్‌ ఫాసిల్, జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు.

Exit mobile version