Allu Arjun: అల్లు అర్జున్ కండీషన్స్‌పై ఐకాన్ స్టార్ టీం అధికారిక ప్రకటన.. లేఖలో ఏముందంటే?

Allu Arjun

Allu Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కానీ ఈసారి కొత్త సినిమా లేదా బాక్సాఫీస్ రికార్డుల ద్వారా కాదు.. ఒక వైరల్ పాడ్‌కాస్ట్ క్లిప్ కారణంగా. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా ఒక పాడ్‌కాస్ట్‌లో అల్లు అర్జున్ గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ని కలవడానికి 42 కఠిన నియమాలు ఉన్నాయని అన్నారు. “అల్లు అర్జున్‌ని కలవడానికి ముందు ఆయన మేనేజర్లను కలవాలి, వాళ్లు లేయర్లు లేయర్లుగా ఉండి అనేక రూల్స్ చెబుతారు. సార్ కళ్లలోకి చూడకండి, సార్‌కి హ్యాండ్‌షేక్ ఇవ్వకండి, అంటూ రూల్స్ అమలు చేస్తారు” అని అన్నారు.

READ ALSO: Electric Cars: పంచ్ నుంచి సైరోస్ వరకు.. 2026లో వస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్‌లు ఇవే..

ఈ క్లిప్ సోషల్ మీడియాలో రిలీజ్ అయిన వెంటనే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం వారు అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా, మరొక వర్గం వారు అల్లు అర్జున్‌కు అనుకూలంగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వివాదంపై తాజాగా అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి అధికారిక స్టేట్‌మెంట్ వచ్చింది. ఈ స్టేట్‌మెంట్ సారాంశం ఏమిటంటే.. “ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 42 నియమాలు అనే క్లెయిమ్ పూర్తిగా బేస్‌లెస్, అసత్యం. ఇలాంటి అపోహలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారిపై డిఫమేషన్ చర్యలు తీసుకుంటున్నాం” అని ఉంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ టీమ్ రిలీజ్ చేసిన ఈ అఫీషియల్ స్టేట్‌మెంట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

READ ALSO: Mukesh Ambani: బిలియనీర్ చూపు.. దక్షిణ భారత్ వైపు! అంబానీ చేతిలోకి ‘సదరన్ హెల్త్ ఫుడ్స్..